ఎలుకను చూసి పారిపోయిన పిల్లి...నెట్టింట్లో హల్ చల్  

Rat Chases Cat Video Viral In Social Media-

టామ్ అండ్ జెర్రీ సిరీస్ చూడడం అంటే పిల్లల నుంచి పెద్దలు అందరూ ఇష్టపడతారు.ఆ సిరీస్ లో ఎలుక-పిల్లుల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు అందర్నీ కడుపుబ్బా నవ్విస్తాయి.

Rat Chases Cat Video Viral In Social Media--Rat Chases Cat Video Viral In Social Media-

అయితే నిజంగా అలాంటి టామ్ అండ్ జెర్రీ సంఘటన రియల్ లైఫ్ లో చోటుచేసుకుంది.అది అక్కడ జరిగింది అన్న వివరాలు పక్కన పెడితే, ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

Rat Chases Cat Video Viral In Social Media--Rat Chases Cat Video Viral In Social Media-

పిల్లి,ఎలుక అనగానే వారి వైరం సంగతి అందరికి తెలుసు.సాధారణంగా పిల్లి గనుక ఎలుకను చూస్తే వడిసి పట్టి దానిపై దాడి చేస్తుంది అని ఎలుక చాటు,చాటుగా సంచరిస్తూ ఉంటుంది.కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.రోడ్డు పక్కన వెళుతున్న పిల్లి కి ఉన్నట్టుండి అటు పక్కాగా ఆహరం దొరికింది.

దీనితో ఆహారాన్ని చూసి సంతోషపడుతూ అటు పరుగులు తీయగా,అటుగా వచ్చిన ఎలుక పిల్లి పై రివర్స్ అయ్యింది.అంతే ఇక పిల్లి కనీసం దానిని నిలువరించలేకపోవడమే కాకుండా పారిపోయింది.దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.దీనితో అందరూ నిజంగా ఎలుకను చూసి పిల్లులు పారిపోతాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.