రెండు కోట్లు ఇస్తానన్నా కూడా ఆ కుర్ర హీరోతో రష్మిక చేయనందట  

Rashmikha Mandhana Allu Arjun And Sukumar Rashmikha Tollywood Shootings Closed - Telugu Allu Arjun And Rashmikha, Allu Arjun And Sukumar, Rashmikha Latest Update, Rashmikha Mandhana, Rashmikha Reject The Young Hero Movie

ఈ ఏడాది ఆరంభంలోనే సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో సూపర్‌ హిట్స్‌ను అందుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.ఈ అమ్మడు అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న చిత్రంలో నటించేందుకు సిద్దం అయ్యింది.

 Rashmikha Mandhana Allu Arjun And Sukumar Rashmikha Tollywood Shootings Closed

షూటింగ్‌ క్యాన్సిల్‌ అవ్వడం వల్ల ప్రస్తుతం రష్మిక బన్నీ సినిమాలో నటించడం లేదు.షూటింగ్స్‌ అన్నీ కూడా బంద్‌ అయ్యాయి.

ఈ సమయంలో ఈమె వద్దకు ఒక ఆఫర్‌ వచ్చిందట.ఒక దర్శకుడు ఈమెను సంప్రదించాడట.

రెండు కోట్లు ఇస్తానన్నా కూడా ఆ కుర్ర హీరోతో రష్మిక చేయనందట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

యంగ్‌ హీరో కోసం ఈమెను సంప్రదించిన దర్శకుడికి నిరాశ మిగిలినట్లుగా తెలుస్తోంది.దర్శకుడు చెప్పిన కథ మెప్పినా కూడా హీరో విషయంలో రష్మిక అసంతృప్తిని వ్యక్తం చేసిందట.ఈమద్య ఆ హీరో వరుసగా మూడు నాలుగు ఫ్లాప్స్‌ను చవిచూశాడట.గతంలో మంచి సినిమాలు చేసినా కూడా ప్రస్తుతం ఆయన కెరీర్‌ ఏమాత్రం ఆసక్తికరంగా లేదని, అందుకే ఆయనతో సినిమా చేయడం తన వల్ల కాదంటూ చెప్పేసిందట.

రెండు కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్‌ చేసినా కూడా ఆ హీరోతో చేసేందుకు మాత్రం ఒప్పుకోలేదట.దాంతో ఆ దర్శకుడు మరో హీరోయిన్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో కొత్త హీరోలతో ఫ్లాప్‌ హీరోలతో సినిమాలు చేయవద్దనే నిర్ణయానికి వచ్చిందట.సినిమా షూటింగ్స్‌ ప్రస్తుతం లేని కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన రష్మిక కుటుంబ సభ్యులతో టైంను స్పెండ్‌ చేస్తోందట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..