రష్మిక మరీ ఓవర్‌ చేస్తుంది.. డ్రీమ్స్‌ నుండి బయటకు రావమ్మ  

Rashmika Tweets Role In Movies Fans - Telugu Rashmika Fans, Rashmika Mandanna, Rashmika Role, Tollywood Heroine, Tweets

ఇండస్ట్రీ ఏది అయినా హీరోయిన్స్‌ విషయంలో మేకర్స్‌ ఒకే విధానంను ఫాలో అవుతున్నారు.సినిమాకు గ్లామర్‌ అద్దేందుకు హీరోకు లవర్‌ లేదా భార్యగా మాత్రమే హీరోయిన్స్‌ను ఎంపిక చేస్తున్నారు.

 Rashmika Tweets Role In Movies Fans

ఇండియన్‌ సినిమాల్లో దాదాపుగా 85 శాతం సినిమాల్లో హీరోయిన్స్‌కు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.కొందరు హీరోయిన్స్‌ అసలు కథతో సంబంధం లేకుండానే సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మెయిన్‌ స్ట్రీమ్‌ కథతో సంబంధం లేకుండానే హీరోయిన్‌ రష్మిక పాత్ర ఉంటుంది.

రష్మిక మరీ ఓవర్‌ చేస్తుంది.. డ్రీమ్స్‌ నుండి బయటకు రావమ్మ-Movie-Telugu Tollywood Photo Image

అలాంటి హీరోయిన్స్‌ తాము గొప్ప పాత్రలు చేస్తాము, మీకు నచ్చిన పాత్రలు చేస్తామంటూ అభిమానులతో చెప్పడం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి.

తాజాగా రష్మిక మందన్న సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు కొందరికి నవ్వు కూడా తెప్పిస్తుంది.మీరు నన్ను ఎలాంటి పాత్రల్లో చూడాలనుకుంటున్నారు.

మీకు నచ్చిన పాత్రల్లో నటించేందుకు ట్రై చేస్తాను మీరు నాకు ఆ పాత్ర ఏంటీ తెలియజేయండి అంటూ రష్మిక ట్వీట్‌ చేసింది.

రష్మిక ట్వీట్‌తో ఆమె అభిమానులు వందల సంఖ్యలో ఆమెను ఎలా చూడాలనుకుంటున్నారో కామెంట్‌ చేశారు.కాని అందులో ఏ ఒక్క పాత్రను అయినా రష్మిక చేయగలదా అంటే అనుమానమే.ఎందుకంటే సినిమాల ఎంపిక ఆమె ఛాన్స్‌ అయినా కథల ఎంపిక మాత్రం ఆమెకు ఛాన్స్‌ లేదు.

కథ నచ్చితేనే లేదంటే ఆ పాత్ర అయితేనే చేస్తాను అనే హీరోయిన్స్‌కు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఛాన్స్‌ ఉండదు.కనుక రష్మిక కూడా పాత్రల కోసం డిమాండ్‌ చేసే అవకాశం లేదు.

ఆ కారణంగానే ఫ్యాన్స్‌ అడిగిన ఏ ఒక్క పాత్ర కూడా ఆమె చేసే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అన్ని సినిమాల్లో కూడా గ్లామర్‌ డాల్‌గా మాత్రమే ఆమె కనిపించే అవకాశం ఉందని నెటిజన్స్‌ అంటున్నారు.

అందుకే రష్మిక మరీ ఓవర్‌ చేయకుండా డ్రీమ్స్‌ లో నుండి బయటకు వచ్చి వచ్చిన ఆఫర్లు దక్కించుకుని అందాలతో ఎంటర్‌టైన్‌ చేయమంటూ కొందరు అభిమానులు సూచిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika Tweets Role In Movies Fans Related Telugu News,Photos/Pics,Images..

footer-test