కొత్త వ్యాపారం మొదలెట్టిన రష్మిక మందన  

Rashmika Tollywood Bangalore Beauty Parlor Telugu Heroins - Telugu Bangalore, Beauty Parlor, Rashmika Will Be Started New Business, Telugu Heroins, Tollywood

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న బ్యూటీ రష్మిక మందన.చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ కి జోడీగా పుష్ప సినిమాలో ఈ భామ సందడి చేస్తుంది.

 Rashmika Tollywood Bangalore Beauty Parlor Telugu Heroins

ఇక రెమ్యునరేషన్ పరంగా నిర్మాతలకి అందుబాటులో ఉండటం, నటిగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవడంతో ఈ ముద్దుగుమ్మ వైపే దర్శకులు, స్టార్ హీరోలు కూడా చూస్తున్నారు.ఇదిలా ఉంటే నేటితరం భామలు క్రేజీ ఉండగానే దానిని నాలుగు డబ్బులు సంపాదించుకొని కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారు.

హీరోయిన్ కెరియర్ ఎలాగూ చాలా తక్కువ కాలం ఉంటుంది కాబట్టి, కెరియర్ ముగిసిన తర్వాత ఫైనాన్సియల్ గా ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆలోచిస్తూ సినిమాతో పాటు మరొక ఆదాయ మార్గం చూసుకుంటున్నారు.

కొత్త వ్యాపారం మొదలెట్టిన రష్మిక మందన-Movie-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఈ దారిలోకి రష్మిక కూడా వచ్చి చేరింది.

త్వరలో ఈమె ఒక బ్యూటి పార్లర్స్ ని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉందని అంటున్నారు.బెంగళూరులో ముందు ప్రారంభించి విజయవంతం అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా విస్తరించాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఆమె సొంత రాష్ట్ర౦ కర్ణాటక కాబట్టి ముందు అక్కడి నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత అన్ని ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో పాప ఉందని టాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు.ఇప్పటికే టాలీవుడ్ భామలైన తమన్నా, రకుల్, శ్రద్దా శ్రీనాథ్, శ్రియ లాంటి అందాల భామలూ కొత్త వ్యాపారాలు మొదలెట్టి అందులో భాగా సంపాదిస్తున్నారు.

ఇప్పుడు వీరి దారిలోకి రష్మిక కూడా వచ్చి చేరడం విశేషం.

ఆమె ఇప్పటికే మరో సీనియర్ హీరోయిన్ దగ్గర దీనికి సంబంధించిన సలహాలను కూడా తీసుకుంది అంటున్నారు.

ఇందుకోసం ముందు రెండు కోట్ల వరకు పెట్టుబడి పెట్టే ఆలోచనలో రష్మిక ఉందని సమాచారం.ప్రతీ చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది అంటున్నారు.

ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని దసరా తర్వాత మాత్రం ఈ బ్యూటి పార్లర్ ని ఆమె మొదలు పెట్టే అవకాశం ఉందని సమాచారం.ఓపెనింగ్ కి మాంద్యా ఎంపీ సుమలత ను పిలుస్తారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika Will Be Started New Business Related Telugu News,Photos/Pics,Images..