తమిళ స్టార్ హీరోతో రష్మిక రొమాన్స్..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.గీతా గోవిందంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Rashmika To Romance Tamil Hero Suriya-TeluguStop.com

ఇప్పుడు తాజాగా నితిన్ సరసన భీష్మ చిత్రంలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోయే సినిమాలోనూ అమ్మడు ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ క్రేజ్ ఇలా ఉండగానే రష్మిక తమిళ ఛాన్సులు కూడా దక్కించుకుంటోందట.తమిళ స్టార్ హీరో సూర్య నటించబోయే సినిమాలో ఆమెను హీరోయిన్‌గా సెలెక్ట్ చేయాలని చూస్తోంది చిత్ర యూనిట్.

ఇప్పటికే సూర్య తమ్ముడు కార్తీ సరసన సుల్తాన్ అనే సినిమాలో నటిస్తోన్న రష్మికకు ఈ దెబ్బతో తమిళంలోనూ అదిరిపోయే క్రేజ్ వచ్చి పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మొత్తానికి తెలుగుతో పాటు తమిళంలోనూ అమ్మడు వరుస అవకాశాలతో దూసుకుపోతుండటంతో, రష్మిక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరి సూర్య సరసన ఆమె నటించబోయే సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube