అయ్యో... రష్మిక మందన్న ని తీసేసారా..?

టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ ఫేమ్ సంపాదించి అగ్ర హీరోయిన్ల సరసన కొనసాగుతున్నటువంటి రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం చేయ నవసరం లేదు.అయితే తాజాగా ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం దర్శకనిర్మాతలు రష్మిక మందన్న డేట్ల కోసం క్యూ కొడుతున్నారు.

 Rashmika Terminated Into The Suriya Upcoming-TeluguStop.com

అయితే రష్మిక మందన్న ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నట్లు పలు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం రష్మిక మందన్నని ఈ చిత్రం నుంచి తప్పించినట్లు సమాచారం.

అంతేకాక రష్మిక మందన స్థానంలో కోలివుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా  చిత్రానికి ప్రముఖ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే రష్మిక ను సూర్య చిత్రం నుంచి తీసేసారన్న వార్తలపై దర్శకుడు మాత్రం స్పందించడం లేదు.దీంతో ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Telugu Rashmika Suriya, Rashmika Latest, Rashmika-Movie

అయితే ఇది ఇలా ఉండగా రష్మిక మందన్న మాత్రం ప్రస్తుతం సెలవులను ఎంజాయ్ చేస్తోంది.అంతేగాక ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించినటువంటి భీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.దీంతో వరుసగా సినిమాలు చేసి అలసిపోయిన   రష్మిక కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube