పాపం... ఆ ఒక్క విషయంలో రష్మికకు ఎదురుదెబ్బ

రష్మిక మందనా పేరు ప్రస్తుతం టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు మారిమ్రోగిపోతోంది.వరుస సినిమాలు చేస్తూ అసలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది.

 Rashmika Tamil Movie Sulthan Talk-TeluguStop.com

అయితే తెలుగులో గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ఇక బాలీవుడ్ నుండి కూడా రష్మిక కు ఆఫర్లు వస్తుండడంతో పూర్తి స్థాయిలో రష్మిక బాలీవుడ్ పై దృష్టి పెట్టినట్టు సమాచారం.అయితే టాలీవుడ్ లో టాప్ పోజీషన్ లో ఉంటూ తమిళంలో కూడా పాగా వేయాలన్న రష్మిక ప్లాన్స్ ఫెయిల్ అయిపోయాయి.

 Rashmika Tamil Movie Sulthan Talk-పాపం… ఆ ఒక్క విషయంలో రష్మికకు ఎదురుదెబ్బ-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మిక, కార్తీ జంటగా నటించిన చిత్రం సుల్తాన్… ఈ సినిమా తమిళ వర్షన్ లో చతికిల పడ్డ విషయం తెలిసిందే.అయితే తెలుగులో కూడా రీమేక్ గా విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా బాక్సాఫీస్ ముందు నిరాశపరచింది.

ఏది ఏమైనా తమిళంలో ఈ సినిమా హిట్ కొట్టినట్లయితే రష్మిక కల నెరవేరి ఉండేదని రష్మిక అభిమానులు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది.

#Karthi #RashmikaTamil #ActressRashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు