ఐకాన్ స్టార్ కు స్పెషల్ గిఫ్ట్ పంపిన రష్మిక.. ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా రెండు పార్టులుగా వస్తున్నా విషయం తెలిసిందే.మొదటి పార్ట్ ను ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు.

 Rashmika Surprises Allu Arjun With Special Goodies Says Good Luck To Us For Push-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు.ఇప్పటికే అల్లు అర్జున్, రష్మిక లుక్ రివీల్ అయ్యింది.ఇద్దరు కూడా మాస్ గా కనిపించి అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.ఇక ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు రష్మిక మందన్న ఒక స్పెషల్ గిఫ్ట్ ను పంపింది.

ఈ విషయాన్నీ అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

పుష్ప రిలీజ్ దగ్గర పడుతుండడంతో రష్మిక పుష్ప కోసం ఆల్ ది బెస్ట్ చెబుతూ స్పెషల్ గిఫ్ట్ ను అల్లు అర్జున్ కు పంపింది.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Pushpa Dec, Rashmika Wishes-Movie

దీంతో ఈ గిఫ్ట్ ను అల్లు అర్జున్ ఫోటో తీసి ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసి థాంక్యూ డియర్ అని పెట్టాడు.గిఫ్ట్ తో పాటు రష్మిక ఒక కార్డు కూడా పంపింది.అందులో.”పుష్ప కోసం మనకు ఆల్ ది బెస్ట్.లవ్, రష్మిక అని రష్మిక గిఫ్ట్ తో పాటు ఈ నోట్ ను పంపించింది.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Pushpa Dec, Rashmika Wishes-Movie

ఈ గిఫ్ట్ పంపించినందుకు ఐకాన్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపాడు.ఇక పుష్ప టీమ్ ఏ అవకాశాన్ని కూడా వదులు కోవడం లేదు.చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఈ సినిమాను మరింత ప్రోమోట్ చేస్తున్నారు.

ఇక ఐకాన్ స్టార్ కు ఇది మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీలో రిజల్ట్ పై టెన్షన్ గా ఉంది చిత్ర యూనిట్.మరి చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube