నాకు బాయ్‌ ఫ్రెండ్‌ కావాలని అమ్మను పదే పదే అడిగేదాన్ని..!  

‘గీత గోవిందం’ ముద్దుగుమ్మ రష్మిక ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా జోరుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈమె కన్నడంలో రెండు మూడు చిత్రాలు చేస్తుండగా గీత గోవిందం ఎఫెక్ట్‌తో తెలుగులో మూడు చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కాయి. ఇంకా కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. భారీ ఎత్తున గీతకు క్రేజ్‌ దక్కడంతో పారితోషికం కూడా భారీగా డిమాండ్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. తెలుగులో ఒక స్టార్‌ హీరో నటిస్తున్న, భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఒక చిత్రంలో ఈమెకు ఛాన్స్‌ దక్కినట్లుగా సమాచారం అందుతుంది.

Rashmika 's Mother Opens Up About Her Relationship With Daughter-

Rashmika 's Mother Opens Up About Her Relationship With Her Daughter

తాజాగా రష్మిక మీడియాతో మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు నాకు పూర్తి స్వేచ్చను ఇచ్చాడు. అయితే ఆ స్వేచ్చను నేను ఎప్పుడు కూడా వృదా చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. నా తల్లి నాకు ఒక మంచి స్నేహితురాలు. ఆమెతో సరదాగా టైం గడపడంతో పాటు, ఆమెను ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. నేను నా తల్లిదండ్రుల వద్ద ఎప్పుడు కూడ చిన్న ప్లిలా ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అమ్మతో నేను చాలా క్లోజ్‌గా ఉండేదాన్ని. కనుక నా విషయాలన్నీ కూడా ఆమెకే చెప్పేదాన్ని.

Rashmika 's Mother Opens Up About Her Relationship With Daughter-

అందరికి బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారమ్మా.. నాకు కూడా బాయ్‌ ఫ్రెండ్‌ కావాలి అంటూ నేను పదే పదే అమ్మను అడిగేదాన్ని. అందుకు అమ్మ కూడా సరదాగా స్పందించేంది. కొందరు అబ్బాయిలను చూపించి, ఆ అబ్బాయితో స్నేహం చేయి అంటూ సలహా ఇస్తూ ఉండేది. నేను రక్షిత్‌ను ప్రేమించినట్లుగా మొదట అమ్మకు చెప్పాను. నా అభిప్రాయంను గౌరవించి నీ ఇష్టం అన్నారు. కాని ఆ బంధం ఇంత త్వరగా ముగుస్తుందని తాను ఊహించలేదు. కొన్ని బంధాలు మద్యలోనే వదులుకోవడం ఇద్దరికి మంచిదనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇద్దరి మద్య కొన్ని బేధాభిప్రాయాలు ఉన్న కారణంగానే తాము కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.