101వ పెళ్లికొడుకుగా మహేష్.. షాకిచ్చిన బ్యూటీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పాటు చేసింది.ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మహేష్ నటిస్తున్నట్లు చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

 Rashmika Reveals Interestingnews Of Sarileru Neekevvaru-TeluguStop.com

కాగా ఆ తరువాత వరుసగా మహేష్ పోస్టర్లు వదిలారు చిత్ర యూనిట్.దీపావళి కానుకగా లేడీ అమితాబ్ విజయశాంతి పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న రష్మిక మందన లుక్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఇందులో ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి ఉన్న ఫోటోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.అయితే ఈ పోస్టర్‌లో రష్మిక ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది.101వ పెళ్లి కొడుకుగా వచ్చిన మహేష్‌ను ఎలా డీల్ చేయాలో సంక్రాంతికి తెలుస్తుందని ఆమె తన సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

Telugu Anil Ravipudi, Mahesh Babu, Rashmika-

అంటే ఈ సినిమాలో రష్మికను పెళ్లిచూపులు చూసే 101వ పెళ్లికొడుకుగా మహేష్ వస్తున్నాడని ఆమె రివీల్ చేసింది.దీన్ని బట్టి ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలపకనే తెలిపింది.దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, ఏకే ప్రొడక్షన్స్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తుండగా సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube