ఆ విషయంలో రష్మికకు 100 మార్కులు వేసిన ఉపాసన!  

మెగా కోడలు ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తుడడంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వారిలో ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా”యువర్ లైఫ్“అనే వెబ్ సైట్ స్థాపించిన సంగతి మనకు తెలిసినదే.ఈ వెబ్ సైట్ ద్వారా ఫిట్ నెస్, ఆరోగ్యం గురించి తెలియజేశారు.

TeluguStop.com - Rashmika Prepares Kolipattu

అయితే ఇందులో అతిథి సంపాదకురాలుగా అక్కినేని సమంత పాల్గొని ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారో, యూజర్లకు తెలియజేశారు.అంతేకాకుండా కొన్ని ఆరోగ్యకరమైన వంటలను తయారు చేసి, వాటిని వీడియో రూపంలో తన అభిమానులతో పంచుకున్నారు.

సమంత చేసిన ఆ వంటల వీడియోకి భారీ స్పందన లభించింది.

TeluguStop.com - ఆ విషయంలో రష్మికకు 100 మార్కులు వేసిన ఉపాసన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా “యువర్ లైఫ్“ద్వారా తెలుగు హీరోయిన్ రష్మిక పాల్గొన్నారు.

ఈ సైట్ ద్వారా రష్మిక చికెన్ తో ‘కోలీపుట్టు’ కూర వండి ఉపాసనకు రుచి చూపించారు.ఈ కూర రుచి చూసిన తరువాత ఉపాసన రష్మికకు వందకు వంద శాతం మార్కులను ఇచ్చారు.

అంతే కాకుండా ఎంతో అద్భుతంగా తయారు చేసావని రష్మిక పై ఉపాసన ప్రశంసల వర్షం కురిపించారు.

అంతేకాకుండా రష్మిక గురించి ఉపాసన మాట్లాడుతూ ఈ యువ నటి సినీ ఇండస్ట్రీలో తప్పకుండా మంచి విజయాలను అందుకుంటుందని తెలియజేశారు.సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా ఈమెకు ఎవరైనా చెఫ్ గా అవకాశం ఇస్తే తప్పకుండా మంచి వంట చేస్తుందని రష్మికను పొగడ్తలతో ముంచెత్తారు.రష్మిక చేసిన ఈ చికెన్ కూరను తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో,ఎలా చేయాలో ఒక వీడియో రూపంలో చిత్రీకరించి తన అభిమానులతో పంచుకున్నారు.

అంతేకాకుండా రష్మిక, ఉపాసనల మధ్య జరిగిన సరదా సంభాషణ ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

#Your Life #Koliputtu #Upasana #Rashmika Madana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Rashmika Prepares Kolipattu Related Telugu News,Photos/Pics,Images..