ఏ ఎండకు ఆ గొడుకు పడుతున్న బ్యూటీ.. తప్పులేదంటోన్న ఫ్యాన్స్

ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది.విజయ్ దేవరకొండతో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది.

 Rashmika Praises Mahesh Babu As Real Superstar-TeluguStop.com

ఇందులో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో పాటు నితిన్ భీష్మలో కూడా రష్మిక నటిస్తోంది.

అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరిన్ని ఆఫర్స్ పొందేందుకు అప్పుడే ఎత్తులు వేస్తోంది రష్మిక.

తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన రష్మిక మహేష్ బాబును అమాంతం ఆకాశానికి ఎత్తేసింది.మహేష్ నిజంగా ఓ సూపర్ స్టార్ అని, మహేష్‌తో కలిసి నటించినప్పుడు చాలా విషయాలు నేర్చుకోవచ్చని రష్మిక తెలిపింది.

సెట్స్‌పై ఎలా మెలగాలో మహేష్‌ను చూసి అందరూ నేర్చుకోవాలని ఆమో పేర్కొంది.

షూటింగ్‌కు ముందే రిహార్సల్ చేసి ఆయన గ్రేస్‌తో వేసే స్టెప్స్ సూపర్ అంటూ మహేష్‌ను పొగడ్తలతో ముంచెత్తింది రష్మిక.

అయితే ఏ ఎండకు ఆ గొడుకు పట్టడం రష్మిక ఇంస్ట్రీలో తొందరగానే నేర్చుకుందని అందరూ అంటున్నారు.సినీ రంగంలో ఇవన్నీ కామన్, అలా ఉంటేనే ముందుకు సాగుతారని పలువురు రష్మికను వెనకేసుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube