ఓవర్ యాక్షన్‌తో చెడగొట్టిన బ్యూటీ.. మీకు అర్ధమవుతుందా?  

Rashmika Over Action Spoiler Of Sarileru Neekevvaru Movie - Telugu Anil Ravipudi, Mahesh Babu, Rashmika, Sarileru Neekevvaru, Telugu Movie News

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, విజయశాంతిల యాక్టింగ్‌‌కు జనాలు ఫిదా అవుతున్నారు.

Rashmika Over Action Spoiler Of Sarileru Neekevvaru Movie

కానీ హీరోయిన్ రష్మిక మందన నటనకు మాత్రం ఆమెను ఓ చెడుగుడు ఆడుకుంటున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా కాస్త నెమ్మదించింది.

దీనికి కారణం చాలానే ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.మొదట్నుండీ ఈ సినిమాలో ట్రెయిన్ సీన్ హైలైట్ కానుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.

కానీ ఆ ట్రెయిన్‌ సీన్‌లో కడుపుబ్బ నవ్వేంత కామెడీ ఏమీ లేకపోవడంతో జనం నిరాశకు గురయ్యారు.

ఇక సెకండాఫ్‌ సాగతీతగా ఉండటం, క్లైమాక్స్‌లో పస లేకపోవడం లాంటి కారణాలను పులువురు క్రిటిక్స్ పేర్కొన్నారు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా పడిపోవడానికి అసలు కారణం హీరోయిన్ రష్మిక అంటున్నారు.గీతా గోవిందం సినిమాలో యాక్షన్ చేసిన రష్మక, ఈ సినిమాలో ఓవర్ యాక్షన్ చేసిందంటూ ఫైర్ అవుతున్నారు.

అమ్మడి ఓవర్ యాక్షన్‌తో ప్రేక్షకులు చిరాకు పడ్డారని, అందుకే ఆమె సీన్లు వచ్చినప్పుడు సెల్‌ఫోన్లలో ముఖాలు పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు.కామెడీ చేయమంటో ఈ బ్యూటీ అదేదో చేసిందంటూ వారు సెటైర్‌ వేస్తున్నారు.ఇక ఆమె చూపించిన మేనరిజానికి ‘‘వామ్మో.’’ అంటున్నారు మరికొందరు.

ఏదేమైనా సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం పడిపోయాయి.దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అటు సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన అల వైకుంఠపురములో సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది.

తాజా వార్తలు

Rashmika Over Action Spoiler Of Sarileru Neekevvaru Movie-mahesh Babu,rashmika,sarileru Neekevvaru,telugu Movie News Related....