పొగరు సినిమా విషయంలో పొగరుగా వ్యవహరిస్తున్న రష్మిక

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన చరిష్మాని పెంచుకుంటూ పోతుంది.

 Rashmika Not Interested In Pogaru Promotions, Tollywood, Sandalwood, South Cinem-TeluguStop.com

తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ కి జోడీగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేస్తుంది.దీంతో పాటు శంకర్, రామ్ చరణ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

మరో వైపు బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు అక్కడ మిషన్ మజ్ను అనే సినిమాలో సిద్దార్ద్ మల్హోత్రాకి జోడీగా నటిస్తుంది.ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

ఈ నేపధ్యంలో గ్యాప్ లేకుండా ఈ ఏడాది మొత్తం రష్మిక బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్ లలో పాల్గొనాల్సి వస్తుంది.ఇదిలా ఉంటే రష్మిక కన్నడంలో ధృవ్ సర్జాకి జోడీగా పొగరు అనే సినిమాలో నటించింది.

ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

అయితే ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో రష్మిక కన్నడ సినిమాని చిన్న చూపు చూస్తుందని కన్నడీగులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ సినిమా కన్నడ, తెలుగు బాషలలో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో కనీసం ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొనకుండా తప్పించుకొని తిరుగుతుందని, సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆ సినిమా దర్శక, నిర్మాతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, హీరో రష్మికకి చెడిందని, ఈ కారణంగానే పొగరు సినిమాకి ఆమె దూరంగా ఉంటున్నట్లు టాక్ నడుస్తుంది.

ఏది ఏమైనా మాతృభాష సినిమా విషయంలో రష్మిక చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పొగరు చూపిస్తుందని శాండల్ వుడ్ లో చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube