పుష్పలో రష్మిక పాత్ర అలా ఉండదటగా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.

 Rashmika Non De Glamour Role In Pushpa-TeluguStop.com

కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే.

 Rashmika Non De Glamour Role In Pushpa-పుష్పలో రష్మిక పాత్ర అలా ఉండదటగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈ సినిమాలో బన్నీ డీగ్లామర్ పాత్రలో నటిస్తుండటంతో హీరోయిన్ ఎలా కనిపిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన కూడా డీగ్లామర్ పాత్రలో నటిస్తుందని ఇప్పటికే చిత్ర వర్గాల్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఈ సినిమాలో రష్మిక డీగ్లామర్ పాత్ర ఏమీ చేయడం లేదని తెలుస్తోంది.

ఆమె ఈ సినిమాలో మామూలుగానే కనిపిస్తుందని తెలుస్తోంది.మరి బన్నీ డీగ్లామర్ పాత్రకు రష్మికను ఎలా కనెక్ట్ చేస్తారా అనేది పుష్ప చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ శరవేగంగా జరుపుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#Allu Arjun #Pushpa #Sukumar #Rashmika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు