అంత అదృష్టం నాకు లేదు లేండి.. నన్నెవరు అందుకోసం సంప్రదించలేదు   Rashmika Mandanna Will Not Share Screen With Tamil Actor Vijay     2018-11-29   11:43:38  IST  Ramesh P

‘ఛలో’ చిత్రంతో సక్సెస్‌ దక్కించుకుని ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్‌డంను దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈమె ప్రస్తుతం తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా దూసుకు పోతుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో మరో చిత్రం చేస్తూ ఉండటంతో పాటు ఇంకా పలు చిత్రాల్లో కూడా నటించేందుకు ఓకే చెప్పింది, మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరో వైపు ఈమె తమిళ సినీ పరిశ్రమలో కూడా సందడి చేస్తోంది. తమిళంలో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తాజాగా ఈమె తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి జోడీగా ఎంపిక అయ్యిందని వార్తలు వచ్చాయి.

విజయ్‌, అట్లీ కుమార్‌ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌గా రూపొందబోతున్న కొత్త సినిమాలో రష్మిక రెండవ హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందని వార్తలు వస్తున్నాయి. మొదటి హీరోయిన్‌గా నయనతార ఎంపిక అయ్యింది. రష్మిక ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు పుకార్లే అని తేలిపోయింది. స్వయంగా రష్మిక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తాను విజయ్‌ మూవీలో నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొంది.

Rashmika Mandanna Will Not Share Screen With Tamil Actor Vijay-Rashmika Vijay

విజయ్‌ మూవీ కోసం ఎవరు నన్ను సంప్రదించలేదు, ఒకవేళ విజయ్‌ మూవీలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ప్రకటించింది. విజయ్‌ సినిమాలో నటించడం అంటే గౌరవంగా భావిస్థాను అంటూ పేర్కొంది. భవిష్యత్తులో విజయ్‌ మూవీలో నటిస్తాననే నమ్మకం ఉందని రష్మిక పేర్కొంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో చాలా సంతోషంగా ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. స్టార్‌ డం అనేది తనకు ఈజీగా ఏం రాలేదని, కన్నడంలో చాలా కష్టపడితే కాని తనకు ప్రస్తుతం ఈ స్థాయి దక్కిందని రష్మిక పేర్కొంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.