అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చిన రష్మిక.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ కన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి అందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ రేంజ్ లో అవకాశాలను సొంతం చేసుకుంది.

 Rashmika Mandanna Wants Gift From Allu Arjun-TeluguStop.com

వరుస సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.అంతేకాకుండా రష్మిక అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ నుండి బాలీవుడ్ అవకాశాలను అందుకుంది.

స్టార్ హీరోల సరసన ఈ అమ్మడు తెగ ఆఫర్లు కొట్టేస్తుంది.

 Rashmika Mandanna Wants Gift From Allu Arjun-అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చిన రష్మిక.. ఎందుకో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే టాలీవుడ్ సినీ పరిశ్రమలో రష్మిక స్టార్ హీరోయిన్ స్థానంలో నిలిచింది.

ఇక ఈ బ్యూటీని ఇండియన్ క్రష్ అని తన అభిమానులు ఏకంగా ఒక పేరే పెట్టేసుకున్నారు.ఇదిలా ఉంటే రష్మిక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక అల్లు అర్జున్ కు ఈ అమ్మడు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.

రష్మిక మందన ఏప్రిల్ 5వ తేదీన తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఇక ఈమెకు సినీ పరిశ్రమ నుండి, అభిమానుల నుండి శుభాకాంక్షలు అందాయి.

ఇక అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియా వేదికగా రష్మికకు భలే మంచి రోజు అంటూ, ఈ సంవత్సరం మీకు తిరుగులేదని, మీ జీవితం లో ఏమేమి కోరుకుంటున్నావో అవన్నీ తీరాలని నేను కోరుకుంటున్నాను డియర్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Telugu Alluarjun, Rashmika Mandana, Tollywood, Warning-Movie

ఈ విషెస్ కు రష్మిక స్పందించగా.ప్రస్తుతం అల్లు అర్జున్ పై విసిరిన కామెంట్ మాత్రం వైరల్ గా మారింది.దీంతో నిన్ను ఇలా ఊరికనే వదిలిపెట్టను అంటూ, సెట్లో కలిసినప్పుడు నాతో కేక్ కట్ చేసేంతవరకు నేను ఊరుకోనని, అంతే కాకుండా నాకు గిఫ్ట్ కూడా ఇవ్వాలి అంటూ కామెంట్ చేసింది.

దీనికి అల్లు అర్జున్ త్వరలోనే సెట్ లో కలుద్దాంమంటూ.స్పందించాడు.ఇదిలా ఉంటే ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టీజర్ విడుదల చేయనున్నారు సినీ బృందం.

#Warning #AlluArjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు