పొలం దున్నుతున్న టాలీవుడ్ బ్యూటీ..! వీడియో వైరల్

టాలీవుడ్ సినీ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన గురించి అందరికి తెలిసిందే.తన అందంతో, నటనతో వరుస ఆఫర్లు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

 Rashmika Mandanna Turned As Farmer For Sultan Movie Video Viral , Rashmika Manda-TeluguStop.com

అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థానం ను సొంతం చేసుకుని ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉంది.

కన్నడ సినిమా ద్వారా తొలిసారి వెండితెరకు పరిచయమైన రష్మిక తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తుంది.2016లో సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ కేవలం అయిదేళ్లలో 11 సినిమాలలో నటించింది.ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కువ పొందుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే పొలం దున్నుతున్న రష్మిక వీడియో వైరల్ గా మారింది.

ప్రస్తుతం రష్మిక తమిళంలో బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘సుల్తాన్‘.ఈ సినిమాలో కార్తీ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో రష్మిక పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తుంది.

ఇక ఇందులో ఓ సన్నివేశం వీడియో ను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.అందులో రష్మిక పొలంలో దుక్కి దున్నే యంత్రంతో బురదలో రైతు మాదిరిగా పొలం దున్నుతుంది.

ఈ వీడియోను చూసిన నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయనున్నది.ఇక బాలీవుడ్ లో కూడా డెడ్లీ, మిషన్ మజ్ను రెండు సినిమాల్లో నటిస్తుంది.మొత్తానికి రష్మిక వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.