'ఫోర్బ్స్' జాబితా విడుదల.. టాప్ ప్లేస్ లో రష్మిక మందన్నా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కి చలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ రష్మిక ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ అద్భుతమైన విషయాలను అందుకుని ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈమె తాజాగా జరిపిన సర్వేలో ఎంతోమంది ప్రముఖ సెలబ్రెటీలను దాటుకుంటూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

 Actress Rashmika Mandanna Tops Forbes Indias Most Influential Actors, Rashmika Mandanna, Tollywood, Forbs Indian List, Influential Actors, Rashmika Forbes First Place, Vijay Devarakonda, Hero Yash, Samantha, Allu Arjun-TeluguStop.com

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులకు సోషల్ మీడియాలో పెరిగిన ఫ్యాన్స్ ఫాలోయింగ్, లైక్స్, కామెంట్స్, వ్యూస్ వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ”ఫోర్బ్స్” జాబితాను సిద్ధం చేసింది.ఇందులో 10 పాయింట్లకు గాను రష్మిక 9.88 పాయింట్లను కైవసం చేసుకొని మొదటి స్థానంలో నిలిచింది.

 Actress Rashmika Mandanna Tops Forbes Indias Most Influential Actors, Rashmika Mandanna, Tollywood, Forbs Indian List, Influential Actors, Rashmika Forbes First Place, Vijay Devarakonda, Hero Yash, Samantha, Allu Arjun-ఫోర్బ్స్#8217; జాబితా విడుదల.. టాప్ ప్లేస్ లో రష్మిక మందన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu @rashmikamandanna, Allu Arjun, Yash, Rashmikaforbes, Samantha, Tollywood-Movie

ఈ జాబితాలో 9.67 పాయింట్లతో రెండవ స్థానంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉండగా, 9.54 పాయింట్లతో మూడో స్థానంలో క‌న్న‌డ హీరో య‌శ్ ఉన్నారు.ఇక 9.49 పాయింట్లు దక్కించుకొని సమంత నాలుగో స్థానం, 9.46తో అల్లు అర్జున్ ఐదో స్థానంలో నిలిచారు.ఇలా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలను దాటుకొని రష్మిక ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలబడటంతో ఆమె అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube