ప్రస్తుతానికి నేను సింగిల్ అంటున్న రష్మిక... నిందలు వేయొద్దని మనవి

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పెద్ద స్టార్స్ తో జత కడుతున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు, తమిళంలో కార్తీతో సుల్తాన్ సినిమా చేస్తుంది.త్వరలో ఈ రెండు సెట్స్ పైకి వెళ్తాయి.ఇప్పటికే ఈ అమ్మడు తాను షూటింగ్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా అని దర్శకులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధం అని చెప్పింది.

 Rashmika Mandanna Told I Am Single Now, Tollywood, Celebrity Lifestyle, Heroines-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో అందాల భామలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు.ఫ్యాన్స్ అడిగేవాడికి ఉత్సాహంగా సమాధానాలు చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో రష్మిక కూడా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్న సందర్భంగా ఓ అభిమాని మీరు సింగిలేనా అని ప్రశ్న అడిగాడు.

దానికి ఆమె యస్‌ ఐయామ్‌ సింగిల్‌ అని సమాధానం చెప్పడంతో పాటు సింగిల్‌గా ఉండటంలో ఉన్న లాభాలు, నష్టాలు రెండూ వివరించింది.

సింగిల్‌గా ఉండటం అనేది మన చాయిస్‌.మన కంపెనీని మనం బాగా ఎంజాయ్‌ చేయగలిగినప్పుడు ఇంకొకరు ఎందుకు.

మరో ముఖ్య విషయం ఏంటంటంటే సింగిల్‌గా ఉంటూ బాగా ఎంజాయ్‌ చేయగలిగినప్పుడు, మన జీవితంలోకి రాబోయే వాడు ఎలా ఉండాలో అనే విషయంపై క్లారిటీ ఉంటుంది.నష్టం ‌ ఏంటంటే సింగిల్‌గా ఉంటే ఎవరో ఒకరితో ప్రేమలో పడింది అనే వార్తలు తరుచుగా రాసేస్తూ ఉంటారు.

సినిమాలు చేసే సమయంలో ఎవరితో అయినా కాస్తా క్లోజ్ గా మూవీ అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఏముంది అంటూ గాసిప్స్ అల్లేస్తూ ఉంటారు.అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతానికి ఐయామ్‌ హ్యాపీ సింగిల్‌.

ఇక రష్మికా ప్రేమలో పడిందని రాయొద్దు ప్లీజ్‌ అంటూ మీడియా వాళ్లకి రిక్వెస్ట్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube