పుష్ప2 లో రష్మిక మందన్న చేస్తుందా.. ఇదిగో నిర్మాత ఫుల్ క్లారిటీ?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Rashmika Mandanna Srivalli Will Die Pushpa 2 Movie , Pushpa Movie, Rashmika Mandanna, Pushpa 2 Movie,producer, Allu Arjun, Sukumar , Srivalli.producer Ravishankar-TeluguStop.com

పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త పాన్ ఇండియా స్టార్ అల్లుఅర్జున్ గా మారిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఇందులోని పాటలు డైలాగులు ఎక్కడ చూసినా కూడా మార్మోగి పోయాయి.సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

 Rashmika Mandanna Srivalli Will Die Pushpa 2 Movie , Pushpa Movie, Rashmika Mandanna, Pushpa 2 Movie,producer, Allu Arjun, Sukumar , Srivalli.Producer Ravishankar-పుష్ప2 లో రష్మిక మందన్న చేస్తుందా.. ఇదిగో నిర్మాత ఫుల్ క్లారిటీ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే అన్న డైలాగ్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ డైలాగ్ ని ఉపయోగిస్తున్నారు.

సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ డైలాగ్ ని ఇంకా ఎవరు మర్చిపోవడం లేదు.ఈ ఒక్క డైలాగ్ తో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అందరూ కూడా ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ సినిమాలో రష్మిక మందన్న, అల్లు అర్జున్ ల మధ్య సీన్ లు, పాటలు కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఇకపోతే పుష్ప సినిమా మొదటి పార్ట్ లో అలరించిన శ్రీవల్లి పాత్ర సెకండ్ పార్ట్ లో మాత్రం చనిపోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ వార్తలపై నిర్మాత రవిశంకర్ స్పందించారు.అదంతా చెత్త.నాన్సెన్స్.అసలు పుష్ప 2 సినిమా కథ ఏంటి అనేది మాకే సరిగా తెలియదు అవన్నీ ఊహాగానాలే అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు రవిశంకర్.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఎటువంటి నిజం లేదని, అవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే అని తెలిపారు.ఇకపోతే పుష్ప 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

డిసెంబర్లో సినిమాను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.పుష్ప సినిమా పార్ట్ 2 నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube