జిమ్ లో చెమట చిందిస్తున్న రష్మిక.. వీడియో వైరల్!

Rashmika Mandanna Shares Gym Workout Video Goes Viral

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని ఇటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా ఎక్కడ అవకాశం పలకరిస్తే అక్కడికి వెళ్తుంది.తెలుగులో రష్మిక ప్రెసెంట్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.

 Rashmika Mandanna Shares Gym Workout Video Goes Viral-TeluguStop.com

ఈ సినిమాలో పుష్పరాజ్ భార్యగా రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాతో పాటు రష్మిక రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

 Rashmika Mandanna Shares Gym Workout Video Goes Viral-జిమ్ లో చెమట చిందిస్తున్న రష్మిక.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ లో కూడా రెండు ప్రాజెక్స్ లో నటిస్తుంది.ఇక సినిమా విషయం పక్కన పెడితే రష్మిక ఫిట్ నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది.రోజు గంటల తరబడి జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ ఉంటుంది.తాజాగా జిమ్ లో చేస్తున్న వర్క్ ఔట్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రెసెంట్ రష్మిక చేతిలో అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.వీటి కోసమే కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ లో తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇంకా స్ట్రాంగ్ గా అవ్వాలని అనుకుంటుంది.

ఇక రష్మిక ఫిట్ నెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా సమయం దొరికితే చాలు జిమ్ లో గంటలు గంటలు చెమట చిందిస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.తాజాగా మరొక వీడియోను రష్మిక షేర్ చేసింది.ఈ వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటుంది.

వీడియోలో రష్మిక తన ఫిట్ నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్ ను తన శక్తినంతా ఉపయోగించి తన్నుతూ కనిపించింది.తన ట్రైనర్ కూడా ఆమెను మరింత ఎంకరేజ్ చేస్తూ కనిపించదు.”చాలా కోపంగా ఉన్నప్పుడు నేను ఏమి చేస్తాను” అంటూ ఈ వీడియోను షేర్ చేసింది.

వీడియోను చుసిన తరుణ్ భాస్కర్ ఫన్నీ కామెంట్ చేసాడు.ఈ కామెంట్ ఇప్పుడు నెటిజెన్స్ ను ఆకట్టుకుంటుంది.

”ఈ వీడియో చూసాక ఏ దర్శకుడు అయినా నిన్ను రీటేక్ కోసం అడుగుతాడా? జస్ట్ టేక్ ఓకే” అంటారు అంటూ కామెంట్ చేసాడు తరుణ్ భాస్కర్.ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మీరు కూడా ఈ వీడియోను చూసి మీ కామెంట్స్ ను తెలియజేయండి.

#Tarun Bhasker #AdavalluMeeku #Pushpa #Workout

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube