రష్మిక టార్గెట్ ఎవరో తెలుసా?  

Rashmika Mandanna Sai Pallavi - Telugu Keerthy Suresh, Rashmika Mandanna, Sai Pallavi

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్ కొట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత యంగ్ హీరో నితిన్‌తో కలిసి భీష్మ అనే సినిమాలో నటించింది.

 Rashmika Mandanna Sai Pallavi

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకుని సత్తా చాటుతోంది.కాగా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్‌గా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ.

అయితే టాలీవుడ్‌లో వరుస సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ఇప్పుటికే ఇక్కడ వరుస హిట్లతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఇద్దరు హీరోయిన్లకు రష్మిక పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.ఫిదా చిత్రంతో టాలీవుడ్‌ను దున్నేసిన సాయి పల్లవి, ఆ తరువాత వరుసబెట్టి సక్సెస్ చిత్రాలను చేసుకుంటూ వెళుతోంది.

రష్మిక టార్గెట్ ఎవరో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

ఇక మహానటి చిత్రంతో నేషనల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంది.

ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లకు టెండర్ పెట్టేందుకు రష్మిక రెడీ అయ్యింది.

పుష్ప సినిమా సక్సెస్‌తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు మీడియం రేంజ్ సినిమాలతో మొదలుకొని భారీ సినిమాల వరకు రష్మిక ముందు పెట్టేందుకు రెడీ అవుతారు.మరి ఈ బ్యూటీ తనదైన యాక్టింగ్‌తో పాటు అందాల ఆరబోతలోనూ తనకు తానే ప్రత్యేకమని ఇప్పటికే నిరూపించుకుంది.

పుష్ప సినిమాతో రష్మిక మరోసారి టాలీవుడ్‌ను షేక్ చేస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika To Beat Sai Pallavi Keerthy Suresh Related Telugu News,Photos/Pics,Images..