అంధురాలి పాత్రలో రష్మికా మందన్న.. ఏ సినిమాలో అంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిన విషయం తెలిసిందే.

 Rashmika Mandanna Playing Blind Role In Upcoming Movie , Rashmika Mandanna, Toll-TeluguStop.com

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది.ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

భాషతో సంబంధం లేకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది రష్మిక.అంతేకాకుండా అందంలో నేషనల్ క్రష్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ.కాగా తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన తదుపరి సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.

ఒక సినిమాలో రష్మిక మందన్న అంధురాలి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.రష్మిక మందన బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి మిషన్ మజ్ను అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది.నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Telugu Bollywood, Majnu, Blind Role, Tollywood-Movie

ఈ సినిమాలో రష్మిక అంధురాలి పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది.అయితే ఇటువంటి రోల్‌ను రష్మికమొదటిసారి నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఈ సినిమాలో రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.మరి రష్మిక పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి మరి.అయితే ఇప్పటికే సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అని అనుకున్నారు.

కానీ ఈ సినిమా ఓటీటీ లోకి డైరెక్ట్ గా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube