హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్న రష్మిక మందన  

Rashmika Mandanna Plan To Shift Hyderabad, Tollywood, Telugu Cinema, South Heroines, Rashmika Mandanna - Telugu Rashmika Mandanna, Rashmika Mandanna Plan To Shift Hyderabad, South Heroines, Telugu Cinema, Tollywood

హీరోయిన్స్ గా రాణిస్తున్న అందాల భామలు ఏ ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వస్తే అక్కడ సెటిల్ అయిపోతారు.కొంత మంది మాత్రం తమ హోం టౌన్ నుంచి కేవలం షూటింగ్ లు ఉన్నప్పుడు మాత్రమే వచ్చిపోతూ ఉంటారు.

TeluguStop.com - Rashmika Mandanna Plan To Shift Hyderabad

అయితే అవకాశాలు పెరగాలంటే ఇండస్ట్రీ వ్యక్తులకి దగ్గరగా ఉండాలనే విషయం బోధపడిన భామలు మాత్రం సినిమా ఇండస్ట్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి షిఫ్ట్ అయిపోతారు.ఇందులో భాగంగా సౌత్ లో రాణిస్తున్న స్టార్ హీరోయిన్స్ అందరూ హైదరాబాద్ లో సొంతగా ఒక ఫ్లాట్ కొనుక్కొని ఇక్కడే ఉంటారు.

హైదరాబాద్ లో ఉంటే సౌత్ లో అన్ని భాషలని కవర్ చేయవచ్చని వారి నమ్మకం.అనుష్క నుంచి ఇప్పుడు రష్మిక వరకు అందరూ ఇదే దారిలో ప్రయాణం చేస్తున్నారు.

TeluguStop.com - హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్న రష్మిక మందన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కొద్దిగా సక్సెస్ వచ్చిన తర్వాత అవకాశాలు పెరుగుతున్నాయి అనే సమయంలో హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతారు.ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన కూడా ఇప్పుడు తెలుగులో అవకాశాలు పెరుగుతూ ఉండటంతో హైదరాబాద్ కి మకాం మార్చేస్తుంది.

తాజాగా ఈ భామ హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఓ డూప్లెక్స్ ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.బెంగుళూరు నుంచి ఇక్కడికి త్వరలో షిఫ్ట్ అయిపోతుందని సమాచారం.

ఇప్పటికే రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి అందాల భామలు హైదరాబాద్ ని తన హోం టౌన్ గా మార్చేసుకున్నారు.అలాగే పూజా హెగ్డే కూడా ముంబై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతుంది.

ఇప్పుడు ఇదే దారిలో రష్మిక కూడా వచ్చి చేరింది.ఈ భామ ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాతో పాటు, తమిళంలో కార్తి జోడీగా సుల్తాన్ అనే సినిమాలో నటిస్తుంది.

వీటితో పాటు అఖిల్- సురేందర్ రెడ్డి సినిమా కోసం రష్మికని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.అలాగే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా రష్మిక కనిపించబోతుందని సమాచారం.

మొత్తానికి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతున్న రష్మికకి మరిన్ని అవకాశాలు పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

#South Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika Mandanna Plan To Shift Hyderabad Related Telugu News,Photos/Pics,Images..