ఈ ఏడాదిలో పుష్ప సెట్‌లో అడుగు పెట్టదట  

Rashmika mandanna not joining pushpa shooting in this year ,Rashmika mandanna,Pushpa Shooting,Allu Arjun, Ram Charan, Corona effect, Forest Scenes, - Telugu Allu Arjun, Bheeshma, Pushpa, Rashmika Mandanna, Telugu Film News, Tollywood

ఈ ఏడాదిలో లక్కీ హీరోయిన్‌ ఎవరు అంటే రష్మిక మందన్నా అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే రష్మిక మందన్న ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ సినిమాలతో సక్సెస్‌ను అందుకుంది.

TeluguStop.com - Rashmika Mandanna Not Joining Pushpa Shooting In This Year

ఆ రెండు సినిమాలు కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడంతో ఈ ఏడాదిలో రెండు సక్సెస్‌లు దక్కించుకున్న ఏకైక హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది.ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మరో రెండు సినిమాలు చేసింది.

కాని కరోనా కారణంగా అవి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.పుష్ప సినిమాలో బన్నీకి జోడీగా ఈమె ఎంపిక అయ్యింది.

TeluguStop.com - ఈ ఏడాదిలో పుష్ప సెట్‌లో అడుగు పెట్టదట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈమె మార్చి నుండే పుష్ప సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది.కాని కరోనా కారణంగా పుష్ప ఆగిపోవడంతో అప్పటి నుండి ఆ సినిమా ముచ్చటే లేదు.

వచ్చే నెల నుండి పుష్ప సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.ఈ నేపథ్యంలో పుష్ప సినిమా షూటింగ్‌ కోసం రష్మిక మందన్నా జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక మందన్న ఈ ఏడాదిలో పుష్ప సినిమా షూట్‌లో పాల్గొనబోవడం లేదట.

ఈ ఏడాదిలో కేవలం అల్లు అర్జున్‌ పై అడవిలో సీన్స్‌ మాత్రమే చిత్రీకరిస్తారు.

ఆ తర్వాత షెడ్యూల్‌ లో అంటే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరగబోతున్న షెడ్యూల్‌కు ఈమె హాజరు కాబోతుంది.అందుకు సంబంధించిన చర్చ ఇప్పటికే జరిగింది.

త్వరలో రష్మిక ఒక తమిళ సినిమా షూటింగ్‌ లో పాల్గొనబోతుంది.మొన్నటి వరకు కార్తీ సుల్తాన్‌ సినిమా షూటింగ్‌లో ఈ అమ్మడు పాల్గొంది.

ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంది.ప్రతి రోజు వర్కౌట్లు చేస్తూ ఆ వీడియోలు మరియు ఫొటోలను నెట్టింట రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూ వస్తోంది.

ఈ అమ్మడు అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలో మాత్రమే కాకుండా శర్వానంద్‌ కు జోడీగా కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఇక ఆచార్య సినిమాలో చరణ్‌ పాత్రకు జోడీగా రష్మిక మందన్నా కనిపించబోతుందట.

#Bheeshma #Pushpa #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika Mandanna Not Joining Pushpa Shooting In This Year Related Telugu News,Photos/Pics,Images..