అందంగా ఉండను, నటన రాదు.. నేను ఎలా ఇంతగా గుర్తింపు తెచ్చుకున్నానో?  

Rashmika Mandanna Lifestyle In Her Voice-

కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఈమెతో సినిమాలు చేసేందుకు టాప్‌ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. యంగ్‌ హీరోలు అయితే ఈమె కోసం తమ డేట్లను అడ్జస్ట్‌ చేసుకునేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది...

అందంగా ఉండను, నటన రాదు.. నేను ఎలా ఇంతగా గుర్తింపు తెచ్చుకున్నానో?-Rashmika Mandanna Lifestyle In Her Voice

ఇంతటి క్రేజ్‌ను దక్కించుకున్న రష్మిక మందన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తిక వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపర్చింది.

ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి, ‘గీత గోవిందం’ చిత్రంలో నటించి స్టార్‌డంను దక్కించుకున్న ఈ అమ్మడు ఇటీవలే ‘దేవదాస్‌’ చిత్రంతో వచ్చింది. ఈ మూడు సినిమాలు కూడా రష్మికకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. అందుకే ఈమెకు తెలుగులో మూడు నాలుగు ఆఫర్లు తెచ్చి పెట్టింది.

తనకు టాలీవుడ్‌లో వచ్చిన క్రేజ్‌ను నమ్మలేక పోతున్నాను అంటూ స్వయంగా రష్మిక చెప్పుకొచ్చింది. తాను ఎలా ఇంత స్టార్‌డంను దక్కించుకున్నానో తనకే అర్థం కావడం లేదు అంటోంది. .

తాజాగా రష్మిక మాట్లాడుతూ… నా నటన నాకే సరిగా నచ్చదు, అందుకే నా ప్రతి సినిమాతో నటనలో చాలా మెలుకువలు నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడిప్పుడే నటనలో ఓనమాలు నేర్చుకుంటున్నాను.

నటనపై ఇంకా నాకు చాలా పట్టు రావాల్సి ఉంది. అయినా కూడా నా నటనను చాలా మంది అభిమానిస్తున్నారు. ఇక నేను అంత అందగత్తెను కూడా కాదు అనే విషయం నాకు తెలుసు.

సినిమా పరిశ్రమలో నన్ను మించిన అందగత్తెలు ఎంతో మంది ఉన్నారు. నా అందంతో పోల్చితే వారు ఎక్కడో ఉంటారు. అయినా కూడా నన్ను ఇంతగా ఆధరిస్తున్నారు.

నా నటన మరియు నా అందం అంత మాత్రమే అయినా కూడా నన్ను ఎందుకు ఇంతగా అభిమానిస్తున్నారో నాకే అర్థం కావడం లేదని, నాకు ఇంతగా గుర్తింపు ఎలా వచ్చిందో నాకే తెలియడం లేదు అంటూ ఫన్నీగా తనపై తానే సెటైర్‌ు వేసుకున్న రష్మిక మందన తెలుగులో మూడు నాలుగు సినిమాలు చేయడంతో పాటు కన్నడంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈమె తెలుగులో మరిన్ని ఆఫర్లను కూడా దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.