జక్కన్న మల్టీస్టారర్‌లో రష్మిక.. నిజమెంత?     2018-11-15   10:41:57  IST  Ramesh P

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా జరిగిన విషయం తెల్సిందే. ఈ చిత్రంకు సంబంధించిన వార్త రోజుకు ఒకటి చొప్పున సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉన్నాయి. సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన దర్శకుడు జక్కన్న ఇప్పటి వరకు హీరోయిన్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. ముగ్గురు ముద్దుగుమ్మలను ఈ చిత్రంలో నటింపజేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఆ విషయాన్ని నిర్థారించారు. అయితే ఇప్పటి వరకు ఆ ముగ్గురు ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Rashmika Mandanna Is The Star In Rajamouli's RRR-Rajamouli Ram Charan RRR Casting

రాజమౌళి మూవీలో హీరోయిన్స్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే నటన ప్రతిభ బాగా ఉన్న వారు మాత్రమే ఎంపిక అవుతారు. అందుకే ఈ చిత్రంలో కూడా మంచి నటికే జక్కన్న అవకాశం ఇస్తాడనే వార్తు వస్తున్నాయి. ఇక రాజమౌళి పలువురు హీరోయిన్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. రాజమౌళి తన సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేసేందుకు వంద రకాలుగా ఆలోచిస్తాడు. అన్ని ఆలోచనలకు సరిపోయేలా ఆ హీరోయిన్స్‌ ఉండాలి. తాజాగా ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో రష్మిక ఒక హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Rashmika Mandanna Is The Star In Rajamouli's RRR-Rajamouli Ram Charan RRR Casting

గీత గోవిందం చిత్రంతో రష్మిక హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే రష్మిక జక్కన్న మల్టీస్టారర్‌లో నటించేంత స్థాయికి చేరుకోలేదు అనేది కొందరి వాదన. రష్మికకు జక్కన్న ఎట్టి పరిస్థితుల్లో ఆసక్తి చూపించడని సమాచారం అందుతుంది. బాలీవుడ్‌ నుండి లేదా మరే ఇతర ఇండస్ట్రీ అయినా స్టార్‌ హీరోయిన్స్‌ను జక్కన్న తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. అప్పుడైనా హీరోయిన్స్‌ విషయంలో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.