రష్మిక మందన్న పై ఫైర్ అవుతున్న నెటిజన్.. ఏకంగా బాయ్ కాట్ చేయమంటూ కామెంట్?

టాలీవుడ్ ప్రేక్షకులకు రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇంట అడుగుపెట్టి.

 Netizen Is On Fire On Rashmika Mandanna ,rashmika Mandanna,  Tollywood,indian Cr-TeluguStop.com

ఫస్ట్ లుక్ ది బెస్ట్ లుక్ అనిపించుకొని తన నటనకు గాను ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది అభిమానులను తన వలపుల వలలో పడేసింది.

ప్రస్తుత సినీ రంగంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ వెలుగు వెలుగుతుంది.

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత ఆ పై వచ్చిన అంజనిపుత్ర, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు, ఆడవాళ్లు మీకు జోహార్లు  వంటి సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు అందుకుంది.

టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ పొందింది.అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ. ఇండియన్ క్రష్ గా ఓ ఊపు ఊపుతుంది.

గత ఏడాది వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‘  సినిమాలో వేరే లెవెల్ లో మెప్పించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మరింత ఎక్కువగా పెరిగింది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లిస్టులో రష్మిక కూడా ఒకరు.ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అడ్వర్టైజ్మెంట్లు కూడా చేస్తూ ఉంది.

అంతేకాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్లి బాగా రచ్చ చేస్తుంది.ప్రస్తుతం ఈ బ్యూటీని ప్రతి ఒక్కరూ బాగా సెంటిమెంట్ గా భావిస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.చాలా వరకు ఈమె ప్రవర్తన చిన్న పిల్లల్లాగా కనిపిస్తూ ఉంటుంది.

ఎప్పుడైనా ఈమె కెమెరా కంటిలో పడితే ఈమె కూడా కెమెరాను చూసి బాగా రెచ్చిపోతుంది.

అందరూ చూడాలి అని డాన్సులు చేస్తూ బాగా షో చేస్తుంది.దీనివల్ల ఈమెకు బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి.

ఏదైనా సినిమా ఈవెంట్లలో ఈమె మాట్లాడే మాటలు చూస్తే మాత్రం అందరూ షాక్ అవుతూ ఉంటారు.ఇక ఇదంతా పక్కన పెడితే ఈమధ్య బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

అలా సోషల్ మీడియాలో కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.తాజాగా తను చీర కట్టుకొని కొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవ్వగా తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.ట్రోలర్స్ మాత్రం ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.ఓ నేటిజన్ మాత్రం ఏకంగా రష్మిక పై కోపంగా కనిపించాడు.పైగా తనను బాయ్ కాట్ చేయమంటూ కామెంట్ కూడా పెట్టడంతో ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube