కచ్చితంగా నేను తమిళనాడు కోడలినవుతా అంటున్న రష్మిక మందన

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి స్పీడ్ మీద ఉంది.

 Rashmika Mandanna Interested To Marry Tamil Person-TeluguStop.com

తెలుగులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు సైన్ చేసిందని టాక్.అలాగే హిందీలో మూడు సినిమాలని రష్మిక చేతిలో పెట్టుకొని ఉంది.

ఈ సినిమాలలో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ అమ్మడు తమిళ్ లో సుల్తాన్ సినిమాలో కార్తికి జోడీగా నటించింది.

 Rashmika Mandanna Interested To Marry Tamil Person-కచ్చితంగా నేను తమిళనాడు కోడలినవుతా అంటున్న రష్మిక మందన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో ఆమె పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.దీంతో అక్కడ కూడా అవకాశాలు భాగానే వస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.సుల్తాన్ సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో నటించడం కోసం అక్కడి పల్లె వాతావరణం సంస్కృతి, సాంప్రదాయాలని రష్మిక పూర్తిగా తెలుసుకుంది.

ఈ నేపధ్యంలో తను ఒక తమిళ్ వ్యక్తినే వివాహం చేసుకుంటానని ఆసక్తికర వాఖ్యలు చేసింది.నేను తమిళనాడు సంస్కృతి, వారి ఆహారం పట్ల ఆకర్షితురాలినయ్యా.ఓ విధంగా చెప్పాలంటే తమిళనాడు ప్రజల ఆహారంతో ప్రేమలో పడిపోయా అందుకే కచ్చితంగా తాను తమిళ్ వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.అయితే ఆమె మాటల బట్టి రష్మిక మనస్సు మొత్తం కోలీవుడ్ ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతుంది.

అయితే కోలీవుడ్ ప్రేక్షకులని బుట్టలో వేసుకొని అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకోవాలని రష్మిక మందన ఇలా తన తెలివితేటలు ఉపయోగించి మాట్లాడినట్లు కూడా నెటిజన్లు నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

#Kollywood #Tamil Person #MissionMajnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు