నానితో రచ్చ చేస్తానంటోన్న కన్నడ కుట్టి  

Rashmika Mandanna In Nani Shyam Singha Roy, Rashmika Mandanna, Shyam Singha Roy, Nani, Tollywood News, Sai Pallavi - Telugu Nani, Rashmika Mandanna, Sai Pallavi, Shyam Singha Roy, Tollywood News

నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు.

TeluguStop.com - Rashmika Mandanna In Nani Shyam Singha Roy

అయితే కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ సినిమా యావరేజ్ మూవీగా నిలిచింది.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నాని ఇప్పటికే రెడీ అయ్యాడు.టక్ జగదీష్ అనే సినిమా షూటింగ్‌ను గతంలోనే ప్రారంభించిన నాని, ఇప్పుడు ఆ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.

TeluguStop.com - నానితో రచ్చ చేస్తానంటోన్న కన్నడ కుట్టి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా తన నెక్ట్స్ చిత్రాన్ని ‘టాక్సీవాలా’ చిత్ర డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయిన నాని, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.శ్యామ్ సింఘ రాయ్ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి నెగెటివ్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ కుట్టి రష్మిక మందనను ఎంపిక చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.దీంతో నాని సినిమాలో రష్మిక పాత్ర ఎలా ఉంటుందా అనే సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఇక ఈ సినిమాలో నాని పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ సినిమాలో రష్మిక నటించే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఏదేమైనా నాని-రష్మిక మందన కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

#Sai Pallavi #Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika Mandanna In Nani Shyam Singha Roy Related Telugu News,Photos/Pics,Images..