మళ్లీ పెంచేసిన రష్మిక.. తలలు పట్టుకుంటున్న నిర్మాతలు  

Rashmika Mandanna Hikes Her Remuneration-remuneration,sarileru Neekevvaru,telugu Movie News

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.ఇటీవల రిలీజ్ అయిన సరిలీరు నీకెవ్వరు సినిమాలో అమ్మడికి అదిరిపోయే రోల్ దొరకడంతో ఆ సినిమా విజయంలో తనవంతు పాత్రను పోషించింది.

Rashmika Mandanna Hikes Her Remuneration-Remuneration Sarileru Neekevvaru Telugu Movie News

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న భీష్మ సినిమాలో నటిస్తోంది.

అయితే తనకు ఉన్న క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకునేందుకు రష్మిక తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు ముందు ఆమెకు కోటిలోపే రెమ్యునరేష్ ఇచ్చేవారని, ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్‌ను ఏకంగా రూ.2 కోట్లకు పెంచేసిందని తెలుస్తోంది.దీంతో చిన్న నిర్మాతలకు, ఆమెను పెట్టి సినిమాలు చేయాలని చూసిన వారికి గట్టి ఝలక్ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఏదేమైనా రష్మిక రెమ్యునరేష్ పెంచేసినా పెద్ద నిర్మాతలు ఆమె కోరినంత ముట్టజెప్పేందుకు రెడీ అవుతున్నారు.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్‌గా ఎంపికైంది.మరి ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్‌ను దక్కించుకోవాలంటే ఆ మాత్రం సమర్పించుకోవాల్సిందే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

తాజా వార్తలు