రష్మిక పారితోషికం టాలీవుడ్‌లోనే రికార్డ్‌  

Rashmika Mandanna Hikes Her Remunaration For Her Next-mr Comrade,rashmika Mandanna,rashmika Mandanna Remunaration,telugu Viral News Updates,vijadevarakonda

ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులు పరిచయం అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన ఆ తర్వాత గీత గోవిందం చిత్రంతో సౌత్‌లోనే స్టార్‌ హీరోయిన్‌ అయిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులోనే కాకుండా తమిళం మరియు కన్నడంలో కూడా ఈమె వరుసగా చిత్రాల్లో నటిస్తోంది..

రష్మిక పారితోషికం టాలీవుడ్‌లోనే రికార్డ్‌-Rashmika Mandanna Hikes Her Remunaration For Her Next

తెలుగులో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు అతి తక్కువ టైంలోనే భారీ పారితోషికం అందుకుంటుంది.

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో చిన్న చిత్రాలతో అడుగు పెట్టిన ఏ హీరోయిన్స్‌ కూడా రెండు మూడు ఏళ్ల కాలంలోనే కోటికి పైగా పారితోషికం అందుకున్న దాఖలాలు లేవు. కాని చిన్న చిత్రాల హీరోయిన్‌గా పరిచయం అయిన రష్మిక ప్రస్తుతం నటిస్తున్న ప్రతి సినిమాకు కోటికి పైగా పారితోషికం తీసుకుంటుంది. మహేష్‌తో నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి గాను రూ.1.15 కోట్ల రూపాయల పారితోషికంను పుచ్చుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

గీత గోవిందం చిత్రం తర్వాత ఈ అమ్మడు మరోసారి విజయ్‌ దేవరకొండతో కలిసి ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటించింది. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది.

ఆ చిత్రం విడుదలైతే ఈ అమ్మడి పారితోషికం మరింతగా పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. రికార్డు స్థాయిలో అంచనాలున్న డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో కూడా విజయ్‌తో ఈ అమ్మడు ముద్దులు పెట్టేసింది. ముద్దులు పెట్టి ఈ అమ్మడు కోట్లు రాబడుతుందని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌.