షాక్ ఇస్తున్న శ్రీవల్లి.. నెక్స్ట్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందంటే?

Rashmika Mandanna Hiked Remuneration, Rashmika Mandanna, Remuneration, Pushpa, Rahul Ravichandran , Allu Arjun , Sukumar

టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న మరొకసారి వార్తల్లో నిలిచింది.ఇప్పటికే ఈ బ్యూటీ పలు సార్లు వార్తల్లో నిలిచి ట్రోల్ అయినా విషయం తెలిసిందే.

 Rashmika Mandanna Hiked Remuneration, Rashmika Mandanna, Remuneration, Pushpa,-TeluguStop.com

తాజాగా మరొకసారి ఈ అమ్మడి టాపిక్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.ఇంతకీ రష్మిక టాపిక్ హాట్ టాపిక్ గా ఎందుకు అయ్యిందో తెలుసా.

ఈమె నెక్స్ట్ సినిమాకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

ప్రసెంట్ రష్మిక టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకు పోతుంది.

నేషనల్ క్రష్ గా అందరి గుండెల్లో నిలిచి పోయిన ఈ అమ్మడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా ఎక్కడ అవకాశం పలకరిస్తే అక్కడికి వెళ్తుంది.

ఇటీవలే అల్లు అర్జున్ తో కలిసి చేసిన పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో కనిపించి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకుంది.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది.దీంతో ఈ అమ్మడి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.

దీంతో రష్మిక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నా ఆలోచనలతో  ఈమె అవకాశాలు వస్తున్నప్పుడే నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి అనుకుంటుంది.

తాజాగా రష్మిక నిర్మాతలకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.గీతా ఆర్ట్స్ వారు ఉమెన్ సెంట్రిక్ సినిమా చేయాలనీ అనుకుని ఆమెను సంప్రదించగా అప్పుడు రష్మిక భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.రష్మిక నిర్మాతల నుండి జీఎస్టీ తో పాటు 2 కోట్లు అడిగినట్టు సమాచారం.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా కోసం ఈమెను సంప్రదించగా ఇంత డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అయ్యారట.మరి నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉండాలిగా.

Rashmika Mandanna Hiked Remuneration

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube