మళ్ళీ రష్మికపై ట్రోలింగ్.. ఈసారి ఏకంగా సినిమాలే చూడనంటూ షాక్?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా ఏకంగా నార్త్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

 Rashmika Mandanna Gets Trolling For Chil -begging Rashmika Mandana, Tollywood, Trolings, Child Begging, Pushpa, Allu Arjun-TeluguStop.com

పుష్ప పాన్ ఇండియా చిత్రంలో నటించి ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్న రష్మిక కొన్నిసార్లు నెటిజన్ల ఆగ్రహానికి బలవుతున్నారు.

స్టార్ హీరోయిన్ అంటే అందం ఉంటే మాత్రమే కాదు అందమైన మనసు కూడా ఉండాలని నెటిజన్లు భావిస్తుంటారు.కానీ రష్మికకు అందమైన మనసు లేదని కేవలం అందం మాత్రమే ఉందని నిరూపించుకున్నారు.

 Rashmika Mandanna Gets Trolling For Chil -begging Rashmika Mandana, Tollywood, Trolings, Child Begging, Pushpa, Allu Arjun-మళ్ళీ రష్మికపై ట్రోలింగ్.. ఈసారి ఏకంగా సినిమాలే చూడనంటూ షాక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ముంబయ్ వెళ్ళిన రష్మిక ముంబైలో ఒక హోటల్ నుంచి బయటకు వచ్చారు.ఈమె బయటకు వస్తున్న నేపథ్యంలో అక్కడే ఒక చిన్న పాప రష్మిక దగ్గరకు వెళ్లి డబ్బులు కావాలని అడిగింది.

అయినా ఆ పాప గురించి రష్మిక పట్టించుకోకుండా నవ్వుతూ ఫోటోలకు ఫోజులిస్తూ వెళ్లి కారులో కూర్చుంది.అదే సమయంలోనే సెక్యూరిటీ ఆ చిన్నారిని పక్కకు పంపించారు.

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్తా వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తూ చిన్నపిల్ల అలా ప్రాధేయ పడుతూ ఉంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నవ్వుతూ ఎలా చూస్తున్నారు అంటూ కామెంట్లు చేయగా… మరి కొందరు కొంచెం కూడా మానవత్వం లేని ఇలాంటి మనిషి సినిమాలు ఇకపై చూడను అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా రష్మిక మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి బలైపోయిందని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube