ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో రష్మిక, పూజా హెగ్డే, సమంత వంటి వారు ఉన్నారు.ఇక పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.ఇప్పుడిప్పుడే రష్మిక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తను కూడా బిజీగా మారిపోతున్నారు.
ఇదిలా ఉండగా వీరిద్దరూ పోటీపడి మరీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నేపథ్యంలో రష్మిక, పూజా హెగ్డేను కాస్త టెన్షన్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి ఫెమ్ ఉన్న హీరోయిన్స్ సినిమాలలో మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇలా రష్మిక, రకుల్, కాజల్, పూజా హెగ్డే వంటి హీరోయిన్స్ ఎన్నో రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు.తాజాగా పూజా హెగ్డేను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని ఒక ఫోన్ కంపెనీ తనను సంప్రదించారు.
దీంతో పూజాహెగ్డే ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసింది.

ఈ క్రమంలోనే అదే ఫోన్ కంపెనీకు రష్మిక కేవలం 50 లక్షలకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ అవకాశాన్ని దక్కించుకుంది.దీంతో పూజా హెగ్డేకి రావాల్సిన ఆ ప్రాజెక్టు కాస్త రష్మిక చేతుల్లోకి వెళ్ళిపోయింది.ఈ క్రమంలోనే ఆమె అత్యంత తక్కువ ధరకే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుందని తెలుసుకున్న పలువురు రష్మిక వద్దకు క్యూ కట్టారు.
వారి బ్రాండ్ ను ప్రమోట్ చేయాలని అడుగుతున్నారట.ఇలా తక్కువ ధరకే రష్మిక అంబాసిడర్ గా వ్యవహరిస్తూ పూజా హెగ్డేను టెన్షన్ పెడుతుందని చెప్పాలి.