అనిల్ రావిపూడిని మెప్పించిన రష్మిక మందన! ఊహించని ఛాన్స్ కొట్టేసింది!  

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన..

  • ప్రస్తుతం టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న క్రేజీ భామ రష్మిక మందన. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి, గీతాగోవిందంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ భామని ఇప్పుడు యువ హీరోలు ఫస్ట్ ఛాయస్ గా చూస్తున్నారు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి విజయ్ దేవరకొండతో జోడీ కడుతుంది. మరో వైపు నితిన్ తో భీష్మ అనే సినిమాకి కమిట్ అయ్యింది. ఇదిలా వుంటే ఈ భామ ఊహించని విధంగా ఓ క్రేజీ ఆఫర్ పట్టేసింది అనే టాక్ వినిపిస్తుంది.

  • ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా నాలుగు హిట్స్ తో స్పీడ్ మీద వున్న కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాతో సూపర్ స్టార్ మహేశ్ తో చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే మహేశ్ ని అనిల్ స్టొరీ చెప్పి ఒకే చేయించుకున్నాడు. ఇందులో హీరోయిన్ గా ముందు సాయి పల్లవిని తీసుకోవలని అనుకున్న ఆమె స్టొరీ విని రిజక్ట్ చేయడంతో మరో ఆప్షన్ గా రష్మిక మందనని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కన్నడలో స్టార్ హీరోలతో జత కడుతున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లో మహేశ్ కి జోడీ గా అవకాశం పట్టేయడంతో స్టార్ హీరోయిన్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది అని చెప్పాలి.