నన్ను టార్చర్ చేస్తావ్ కదా.. ఇప్పుడు పగ తీర్చుకుంటా: రష్మిక మందన

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

 Rashmika Mandanna Funny Comments On Her Trainer Kuldep Sethi, Rashmika Mandanna,-TeluguStop.com

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన విధంగా తగ్గేది లేదు అన్నట్టుగా ఉంది.ఈ సినిమా విడుదల అయి నెల రోజులు అవుతున్నా కూడా ఇంకా పుష్ప సినిమా జోరు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

పుష్ప సినిమా విడుదల అయి ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమా క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

అంతే కాకుండా అల్లు అర్జున్ స్టామినా ఉత్తరాదిన గట్టిగానే వినపడుతోంది.

అంతే కాకుండా పుష్ప సినిమా విషయంలో బాలీవుడ్ స్టార్లు సైతం ఖంగుతినేలా విధంగా కలెక్షన్లు వచ్చాయి.

ఇక ఈ సినిమాలోని పాటలు కూడా యూట్యూబ్ లో రికార్డులను క్రియేట్ చేశాయి.అంతేకాకుండా ఇప్పటికీ ఈ పాటలు ట్రెండింగ్  లో ఉన్నాయి.

ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమాలో  ఉన్న సామీ, శ్రీ వల్లి, ఊ అంటావా పాటలు మార్మోగి పోతున్నాయి.ఇప్పటికే ఈ పాటను రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల వీడియోలను పోస్ట్ చేశారు.

ఇక సినిమాలో శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించింది హీరోయిన్ రష్మిక మందన.అంతేకాకుండా ఇందులో పాటలకు కూడా ఆమె స్టెప్పులను ఇరగదీసింది.

Telugu Kuldep Sethi, Pushpa-Movie

రష్మిక జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతి కూడా సామీ నా సామీ అనే పాటకు స్టెప్పులు వేయడానికి ప్రయత్నించాడు.ఈ విషయం తెలుసుకున్న రష్మిక తన ట్రైనర్ మీద సెటైర్ వేసింది.మామూలుగా అయితే ట్రైనర్ కుల్దీప్ ట్రైనింగ్ సెషన్ లో వర్కౌట్ లు సరిగా చేయమంటూ రష్మిక ను టార్చర్ పెడుతుంటాడట.మరి కుల్దీప్ సామీ పాటకు స్టెప్పులు వేస్తాడు అని తెలిసి ఉంటే స్టేప్పులు నేర్పిస్తూ తన రివేంజ్ తీర్చుకునేదట రష్మిక.

కానీ మొత్తానికి ఆ చాన్స్ మిస్ అయింది అని చెప్పుకొచ్చింది రష్మిక మందన.కుల్దీప్ వేసిన నా సామి స్టెప్పుల వీడియోలు ప్రస్తుతం ఇన్ స్టా రీల్ వీడియో లో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube