రష్మిక మందన అస్సలు తగ్గడం లేదు... క్యూ కడుతున్న ఆవర్లు

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన.ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

 Rashmika Mandanna Full Josh With Movie Offers-TeluguStop.com

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం రష్మిక పేరు వినిపిస్తుంది.కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాటిని ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

మరో వైపు బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలని లైన్ లో పెట్టేసింది.వీటిలో రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది.

 Rashmika Mandanna Full Josh With Movie Offers-రష్మిక మందన అస్సలు తగ్గడం లేదు… క్యూ కడుతున్న ఆవర్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో వైపు ఇప్పటికే సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాకున్నా నటిగా మాత్రం మంచి మార్కులు వేసుకుంది.

దీంతో తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.అక్కడి శివ కార్తికేయన్, సూర్య, ధనుష్, విజయ్ లాంటి హీరోలకి జోడీగా రష్మిక పేరు తెరపైకి వస్తుంది.

ఇప్పటికే ఒకటి, రెండు సినిమాలకి సైన్ కూడా చేసినట్లు తెలుస్తుంది.అయితే అవి ఏంటి అనేది అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే వరకు వేచి చూడాలి.

మొత్తానికి సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఏకంగా ఎనిమిది సినిమాల వరకు రష్మిక మందన చేతిలో ప్రస్తుతం ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.దీంతో ఈ అమ్మడు కాల్ షీట్స్ డైరీ కూడా ఓ రెండేళ్ళ వరకు ఫుల్ అయిపోయిందని సమాచారం.

ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలలో చాలా వరకు మంచి హైప్ ఉన్నవే కావడంతో కచ్చితంగా భవిష్యత్తులో నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఉండటంతో రెమ్యునరేషన్ పరంగా కూడా రెండు కోట్ల వరకు కొత్త ప్రాజెక్ట్ లకి రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు బోగట్టా.

#MissionMajnu #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు