Rashmika Mandanna Pushpa2: రష్మిక 'పుష్ప2' డేట్స్ ను వాడేస్తున్న మేకర్స్.. ఈమె పాత్ర ఇంత చిన్నదా?

పుష్ప ది రైజ్ సినిమా గత సంవత్సరం ఇదే డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది.భారీ విజయం అందుకుంది అన్ని రికార్డులను చెరిపేసిన విషయం తెలిసిందే.

 Rashmika Mandanna For Pushpa Promotions, Allu Arjun, Rashmika Mandanna, Sukumar,-TeluguStop.com

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.సుకుమార్ కూడా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.

ఇటీవలే ఈ సినిమా షూట్ కూడా మొదలు పెట్టారు అనే విషయం ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతుంది.ఈ సీక్వెల్ ను మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

పార్ట్ 2 లో కూడా రష్మిక మందన్న భాగం కానుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా టీమ్ ఇప్పుడు రష్యాలో ప్రత్యక్షం అయ్యింది.

ఎందుకంటే డిసెంబర్ 8న రష్యాలో పుష్ప సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

పుష్ప టీమ్ అంతా రష్యాలో ప్రొమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.

రష్యన్ వర్షన్ కూడా భారీ విజయం సాధించడం కోసం టీమ్ అంతా కలిసి వెళ్లి మరీ అక్కడ ప్రొమోషన్స్ చేస్తూ అక్కడి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.దీంతో ఈ సినిమా అక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని.

ఎంత సాధిస్తుందో తెలియడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో రష్మిక మందన్న కూడా ప్రొమోషన్స్ కు వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.

Telugu Allu Arjun, Pushpa, Russia, Sukumar-Movie

ఎందుకంటే ఈమె పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అవ్వడంతో అన్ని ఇండస్ట్రీలలో వరుస అవకాశాలు వస్తున్నాయి.మరి ఇంత బిజీ షెడ్యూల్స్ లో ఈమె రష్యాకు వెళ్లడమే ఇప్పుడు అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది అని అంటున్నారు.అయితే ఈమె పుష్ప 2 కోసం కేటాయించిన షెడ్యూల్స్ నుండే పుష్ప 1 ప్రొమోషన్స్ కోసం వెళ్ళింది అని టాక్.మరి ఇదే నిజం అయితే ఈమె పాత్ర పుష్ప 1 కంటే పుష్ప 2 లో చాలా తక్కువగా ఉండబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఏది ఏమైనా ఈమె ప్రొమోషన్స్ అక్కడి వరకు వెళ్లడం మంచి విషయమే అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube