రష్మిక సినిమాల ద్వారా అన్ని కోట్లు సంపాదించిందా..?

బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉంటూ రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రష్మికకు తొలి సినిమానే సక్సెస్ కావడం ఆ తరువాత ఆమె నటించిన గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు సక్సెస్ కావడంతో సినిమాసినిమాకు పారితోషికం కూడా భారీగా పెరిగింది.

 Rashmika Mandanna Earned 25 Crore Rupees Through Movies,tollywood,sandalwood,bol-TeluguStop.com

గతేడాది వరకు తెలుగు, కన్నడ చిత్రాల్లో మాత్రమే నటించిన రష్మిక ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుండగా ఒక సినిమాకు ఏకంగా ఆమె 6 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే నాలుగేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్న రష్మిక సినిమాల ద్వారా ఏకంగా 25 కోట్ల రూపాయలు సంపాదించారని తెలుస్తోంది.

Telugu Crore Rupees, Bollywood, Throgugh-Latest News - Telugu

సినిమాలతో పాటు యాడ్స్ లో నటించడం, మాల్స్ ఓపెనింగ్ ద్వారా కూడా రష్మికకు భారీ మొత్తంలో ఆదాయం చేకూరుతోంది.2020 సంవత్సరం చివరినాటికి ఆమెకు సినిమాల ద్వారా సంపాదించిన ఆదాయం పాతిక కోట్లు కాగా బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమాలు హిట్టైతే మాత్రం ఈ ఏడాది ఆమె ఆదాయం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు రష్మిక తనకు గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండటం గమనార్హం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మికకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఆమె రెండేళ్ల క్రితం కన్నడలో నటించిన సినిమాలను తెలుగులో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది.టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలు రష్మిక, పూజా హెగ్డేలకు తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతుండగా రష్మిక బాలీవుడ్ సినిమాలతో బిజీ అయితే మాత్రం తెలుగులో పూజా హెగ్డేకు సినిమా ఛాన్సులు పెరిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube