అతిథి పాత్రలో రష్మిక మందన్న.. ఏ సినిమాలో అంటే?

తెలుగుతెరకు ఛలో సినిమా ద్వారా పరిచయమై ఆ తర్వాత గీతా గోవిందం అంటూ అద్భుతమైన విజయాలను అందుకొని సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

 Rashmika Mandanna Doing Guest Role In Bollywood Movie-TeluguStop.com

ఇలా ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలను చేస్తూ ఉన్న ఈ బ్యూటీ ఒక సినిమాలో అతిథి పాత్రలో చేయడానికి సిద్ధమైంది.రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్‌ వార్‌ డ్రామా కథాంశంతో దుల్కర్‌ సల్మాన్‌ఇండియా-పాకిస్థాన్‌ మధ్య 1964-65లో జరిగిన యుద్ధం నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రష్మిక ఒక అతిధి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో కథకు ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంవల్ల ఇందులో అతిథి పాత్రలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.స్వప్న సినిమాస్‌ పతాకంపై ప్రియాంకదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రష్యాలో ఓ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనున్నారు.

 Rashmika Mandanna Doing Guest Role In Bollywood Movie-అతిథి పాత్రలో రష్మిక మందన్న.. ఏ సినిమాలో అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ షెడ్యూల్ లో రష్మిక పాల్గొన్న పోతున్నట్లు తెలుస్తోంది.ఏదిఏమైనప్పటికీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే స్టార్ హీరోయిన్ గా సినిమాలను చేస్తూ ఇలా అతిథి పాత్రలో నటిస్తూ ఈ బ్యూటీ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

#Chalo #Guest Role

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు