రష్మిక మందాన ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే ..?

గీత గోవిందం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.వరుస సినిమా ఆఫర్లతో తన ప్రతిభను చాటుకుంటుంది.

 Rashmika Mandanna Dhoni Favourate Player Bunny Heroin-TeluguStop.com

అతి తక్కువ వ్యవధిలోనే వివిధ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది ఈ కన్నడ బ్యూటీ.కేవలం సినిమాల్లో నటించడమే మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

అయితే ఈ అమ్మడికి మనలో చాలామంది లాగే క్రికెట్ ను అశ్వదించడం అంటే చాలా ఇష్టమట.

 Rashmika Mandanna Dhoni Favourate Player Bunny Heroin-రష్మిక మందాన ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మిక మందన క్రికెట్ కు సంబంధించిన అప్డేట్స్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతూ వస్తుందట.

సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా కానీ సమయం దొరికినప్పుడల్లా ఆవిడ క్రికెట్ చూసేందుకు ఇష్టపడతారట.అయితే తాజాగా రష్మిక మందన తన సోషల్ మీడియాలో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరన్న ప్రశ్న ఆవిడ అభిమాని నుంచి ఎదురయ్యింది.

దీంతో వెంటనే రష్మిక మందాన తన హీరో మహేంద్రసింగ్ ధోని అంటూ రిప్లై ఇచ్చింది.

ముఖ్యంగా మహేంద్ర సింగ్ బ్యాటింగ్, ఆయన చేసే కెప్టెన్సీ, అలాగే వికెట్ కీపింగ్ అంటే పడి చచ్చిపోతాను అని.అతను మాస్టర్ క్లాస్ ప్లేయర్ అంటూ మహేంద్రసింగ్ ధోని కి కితాబిచ్చింది.ఇదిలా ఉంటే మరో అభిమాని నుండి ఐపీఎల్ లో మీ ఫేవరెట్ జట్టు ఏది అని అడగగా.

అందుకు సమాధానంగా ‘ఈ సాల కప్ నమ్ దే’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై మొగ్గు చూపింది.ఇక సినిమాల విషయానికొస్తే.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ సరసన ఓ సినిమాలో కథానాయకిగా నటిస్తుండగా మలయాళం, తమిళ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మొత్తంగా ఐదారు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ముందుకు తీసుకు వెళుతుంది.ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలలో అవకాశం దక్కించుకున్న రష్మిక మందన తాజాగా మరో అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నట్లు సమాచారం.

#MS.Dhoni #Bunny Heroin #Dhoni #CSK Team

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు