ఆనంద్‌ దేవరకొండ విషయంలో రష్మిక మందన్నా పై ట్రోల్స్‌

విజయ్ దేవరకొండ తమ్ముడు రెండవ సినిమా మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ ఈనెలలో అమెజాన్‌ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో వర్ష హీరోయిన్‌గా నటించింది.

 Rashmika Mandanna Comments On Anand Devarakonda Middle Class Melodies Trailer ,-TeluguStop.com

నిన్న మొన్నటి వరకు కూడా ఈ సినిమా గురించి జనాల్లో పెద్దగా అవగాహణ లేదు.అసలు ఇది ఒక సినిమా ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు.

తాజాగా ట్రైలర్‌ వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు చాలానే చూసినట్లుగా ఉన్నాయి కదా అనిపించింది.అన్నయ్య విజయ్‌ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాను కాస్త మాస్‌ గా కథను మార్చి చేసినట్లుగా ఉంది కదా అంటూ నెటిజన్స్‌ విమర్శలు చేస్తున్నారు.

ట్రైలర్‌ విడుదల అయిన తర్వాత సినిమా గురించి నెట్టింట ప్రముఖులు కూడా స్పందించారు.అయితే రష్మిక మందన్నా స్పందించిన తీరు మరీ అతిగా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి.

మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ సినిమా ట్రైలర్‌ షేర్‌ చేసిన రష్మిక నేను సినిమాను చూశాను.అద్బుతంగా ఉంది.సినిమా మొత్తం నవ్వుతూనే ఉన్నాను అంది.ఇద్దరు నాకు మంచి మిత్రులు వారిద్దరిని కలిపి ఈ సినిమాలో హీరో హీరోయిన్‌గా చూడటం చాలా ఆనందంగా ఉంది.

వీరిద్దరికి ఇదో మంచి సూపర్‌ హిట్‌ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది.ఖచ్చితంగా ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉంటుందనే నమ్మకంను ఆమె వ్యక్తం చేసింది.

ఇంకా ఈ సినిమాపై మూడు ట్విట్లతో చాలా హైప్‌ తెచ్చేలా కామెంట్‌ చేసింది.విజయ్‌ దేవరకొండకు ఈమె స్నేహితురాలు అనే విషయం తెల్సిందే.

ఆ స్నేహం ఆనంద్‌ దేవరకొండకు కూడా కంటిన్యూ అవుతుంది.అందుకే స్నేహితుడి సినిమా అవ్వడం వల్ల మ్యాటర్‌ ఉందో లేదో తెలియకున్నా కూడా హైప్‌ ఇచ్చేలా అంచనాలు పెంచేలా ఆహా ఓహో అంటూ ప్రశంసలు కురిపిస్తుంది అంటూ కొందరు నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా చూడకుండానే అబ్బా అదిరి పోయింది అంటూ రష్మిక ఇస్తున్న ఎక్స్‌ ప్రెషన్స్‌ కు నెట్టింట ట్రోల్స్‌ పడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube