ఆ విషయం విజయ్‌నే అడగండి.. రష్మిక కీలక వ్యాఖ్యలు..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు భారీగా క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే.అలా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న కాంబినేషన్లలో విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ ఒకటి.

 Rashmika  Mandanna Comments About Next Movie With Vijay Devarakonda , Dear Comra-TeluguStop.com

విజయ్ రష్మిక రెండు సినిమాల్లో నటించగా ఒక సినిమా హిట్ ఫలితాన్ని అందుకుంటే మరో సినిమా ఫ్లాప్ ఫలితాన్ని చవిచూసింది.గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ తరువాత రష్మిక విజయ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని రష్మిక విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక, విజయ్ దేవరకొండ తక్కువ కాలంలోనే విజయాలను సొంతం చేసుకుని స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.గతంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు వచ్చినా తాము మంచి స్నేహితులమని రష్మిక, విజయ్ స్పష్టతనిచ్చారు.

అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్న ఫ్యాన్స్ తాజాగా రష్మికనే మళ్లీ విజయ్ తో కలిసి ఎప్పుడు నటిస్తారని ప్రశ్నించారు.

Telugu Dear Comrade, Geetha Govindam-Movie

ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ లో రష్మిక మందన్నా అభిమానులతో ముచ్చటించగా ఈ ప్రశ్న ఎదురైంది.మంచి కథ వస్తే విజయ్ తో కలిసి నటించడానికి తనకు అభ్యంతరం లేదని మళ్లీ విజయ్ తో ఎప్పుడు కలిసి నటించాలనే ప్రశ్న విజయ్ నే అడిగితే బాగుంటుందని రష్మిక కామెంట్స్ చేశారు.మరోవైపు రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మూవీ ఆఫర్లతో బిజీ అవుతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రష్మిక మందన్న తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.తెలుగులో కూడా రష్మిక చేతిలో రెండు సినిమాలు ఉండగా కొత్త సినిమాలతో రష్మిక ఇతర హీరోయిన్లకు షాకిస్తున్నారు.

వరుస ఆఫర్లతో అన్ని ఇండస్ట్రీలలో రష్మిక బిజీ అవుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube