సుకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రష్మిక అభిమానులు

అల్లు అర్జున్‌ బర్త్‌ డే మరో నాలుగు అయిదు రోజులు ఉండగానే పుష్ప చిత్ర యూనిట్‌ సభ్యులు సందడి మొదలు పెట్టారు.పుష్పరాజ్‌ వీడియోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 Rashmika Mandanna Birthday Special Pushpa Look Not Release , Allu Arjun, Pushpa,-TeluguStop.com

అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్బంగా పుష్ప సందడి మామూలుగా ఉండదు అంటూ మైత్రి మూవీ మేకర్స్‌ సోషల్‌ మీడియా తెగ ట్వీట్స్ చేస్తుంది.అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్బంగా హడావుడి చేయడంను ఎవరు తప్పుబట్టడం లేదు.

కాని పుష్ప సినిమాలో హీరోయిన్‌ గా రష్మిక మందన్న లుక్‌ విడుదల చేయక పోవడం విమర్శలకు తెర తీసింది.రష్మిక ఒక ఫొటోను షేర్‌ చేసి హ్యాపీ బర్త్‌ డే రష్మిక అంటూ ట్వీట్‌ చేశారు.

అంతుకు మించి రష్మిక నుండి పుష్ప టీమ్‌ నుండి ప్రత్యేకంగా ఎలాంటి సర్‌ ప్రైజ్‌ కాని ప్రత్యేకంగా ఎలాంటి ఫొటో కాని విడుదల చేయలేదు.

ఒక పోస్టర్‌ కాకున్నా కనీసం బన్నీతో ఉన్న ఒక వర్కింగ్‌ స్టిల్‌ ను అయినా విడుదల చేస్తే బాగుండేది అనే అభిప్రాయం ను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప సినిమా లో రష్మిక లుక్‌ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుంది అనేది మాత్రం అందరికి తెలుసు.కాని అది ఎలా అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఇకపై అయినా చిత్ర యూనిట్‌ సభ్యులు రష్మక లుక్‌ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

రష్మిక మందన్నా పుష్ప లుక్‌ విడుదల చేయక పోవడం పట్ల ఆమె అభిమానులు విమర్శలు చేస్తున్నారు.దర్శకుడు సుకుమార్‌ ను ట్యాగ్‌ చేసి కొందరు పుష్ప నుండి రష్మిక లుక్‌ ను ఆమె బర్త్‌ డే సందర్బంగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కాని వాటి గురించి చిత్ర యూనిట్‌ సభ్యులు అస్సలు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube