ఆ వీడియో ద్వారా నన్ను ఏడిపించారంటున్న మహేష్ బ్యూటీ…  

Rashmika Mandanna Birthday Gift Fan Gift Life Journey Video Tollywood Actress Rashmika Mandanna - Telugu Bheeshma, Birthday Gift, Fan Gift, Life Journey Video, Rashmika Mandanna, Sarileru Nikevvaru, Tollywood Actress Rashmika Mandanna

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతోంది.అయితే ఇటీవలే ఈ అమ్మడు నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు, భీష్మ అనే చిత్రల్లో నటించింది.

 Rashmika Mandanna Birthday Gift Fan Gift Life Journey Video Tollywood Actress Rashmika Mandanna

ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.దీంతో ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్లలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు పోతోంది.

అయితే ఇటీవలే నిన్నటి రోజున రష్మిక మందన్న తన 24వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.

ఆ వీడియో ద్వారా నన్ను ఏడిపించారంటున్న మహేష్ బ్యూటీ…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో భాగంగా రష్మిక మందన్న అభిమాని ఆమెకు ఊహించినట్టు వంటి గిఫ్ట్ ఇచ్చాడు.

అయితే ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే ఆమె యొక్క తొమ్మిది సంవత్సరాల సినీ ప్రయాణాన్ని ఓ వీడియో రూపంలో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ఖాతాల్లో షేర్ చేశాడు.ఈ వీడియోని చూసినటువంటి రష్మిక మందన్న తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించింది.

ఇందులో భాగంగా ఈ వీడియో నన్ను భావోద్వేగానికి గురి చేసిందని, ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్లో పేర్కొంది. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడాలంటూ తన అభిమానులని కోరింది.

అయితే మరోవైపు టాలీవుడ్ కి చెందినటువంటి సినీ ప్రముఖులు కూడా రష్మిక మందన్నకి సోషల్ మీడియా వేదిక ద్వారా  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ పనులు కూడా మొదలవగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొంత కాలం పాటు ఈ పనులను నిలిపివేశారు.అయితే కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ఓ స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika Mandanna Got Emotional About Fan Birthday Gift Related Telugu News,Photos/Pics,Images..