అందుకే రేటు పెంచా అంటున్న రష్మిక మందన  

Rashmika Mandana Told About Her Remuneration Hike-

చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి దూసుకోచ్చేసింది.వరుసగా రెండు విజయాల్ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, బన్నికి జోడీగా చేసే అవకాశాలని అందుకుంది.ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది...

Rashmika Mandana Told About Her Remuneration Hike--Rashmika Mandana Told About Her Remuneration Hike-

ఇదిలా ఉంటే మరో వైపు విజయ్ దేవరకొండతో చేసిన రెండో సినిమా డియర్ కామ్రేడ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇక ఈ సినిమా తన సొంత భాషలో కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతూ ఉండటంతో ప్రమోషన్ పై దృష్టి పెట్టింది.

ఇదిలా ఉంటే వరుస అవకాశాలతో ఈ భామ తన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసింది.

Rashmika Mandana Told About Her Remuneration Hike--Rashmika Mandana Told About Her Remuneration Hike-

మాతృ భాష అయిన కన్నడలో సినిమా అవకాశాలు వస్తున్నా రెమ్యూనరేషన్ ఎక్కువ చెప్పడం, డేట్స్ దొరకపోవడం తో కన్నడ దర్శక నిర్మాతలకి అమ్మడితో భాగా టెన్షన్ అయిపోతుంది.ఇక బెంగుళూరు లో డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్ లో రష్మికను అక్కడ మీడియా వారు రెమ్యూనరేషన్ పెంచడంపై ప్రశ్నించారు.దానికి రష్మిక కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పింది.

మీడియాలో ఉన్న మీరు ప్రతి సంవత్సరం హైక్స్, ప్రమోషన్లు కోరుకుంటారు కదా… అలాంటపుడు నేను రెమ్యునరేషన్ పెంచడంలో తప్పేముంది అని రివర్స్ ప్రశ్న వేసేసరికి మీడియా వారంతా సైలెంట్ అయిపోయారు.అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా మొత్తానికి రష్మిక తాను రెమ్యునరేషన్ పెంచిన విషయాన్ని ఇలా మీడియా ముఖ్యంగా ఇప్పుడు నేరుగా ఒప్పుకుంది అని మాత్రం చెప్పొచ్చు.