రౌడీస్టార్ తో మళ్ళీ జతకట్టబోతున్న రష్మిక మందన

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు చేతిలో తెలుగు సినిమాలు రెండు, హిందీ సినిమాలు రెండు, తమిళ్ సినిమా ఒకటి ఉన్నాయి.వీటితో పాటు మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.యంగ్ స్టార్ హీరోలు అందరూ తమ సినిమాల కోసం రష్మికకే ఓటు వేస్తున్నారు.ఈ అమ్మడు అటు గ్లామర్, ఇటు పెర్ఫార్మెన్స్ ని సమానంగా హ్యాండిల్ చేయడంతో రష్మికని ఛాయస్ గా ఎంచుకుంటున్నారు.పూజా హెగ్డే టాప్ హీరోయిన్ గా ఉన్న కూడా కాస్తా స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి తప్ప కుర్ర హీరోలకి దొరకదు.

 Rashmika Mandana Third Time Romance With Vijay Devarakonda-TeluguStop.com

అలాగే సెట్ కాదు.కాని రష్మిక ఎవరికైనా సెట్ అయిపోతుంది.

ఈ నేపధ్యంలోనే అందరి ఫోకస్ ఆమె మీద ఉంది.

 Rashmika Mandana Third Time Romance With Vijay Devarakonda-రౌడీస్టార్ తో మళ్ళీ జతకట్టబోతున్న రష్మిక మందన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో చేసిన గీతాగోవిందం సినిమా కెరియర్ లో బిగ్ బ్రేక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో మళ్ళీ విజయ్ తో రష్మిక జత కట్టింది.ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

కాని నటిగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి.ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండతో రష్మిక జత కట్టబోతున్నట్లు తెలుస్తుంది.

పుష్ప తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు.ఆ సినిమా కోసం రష్మికనే హీరోయిన్ గా తీసుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్ వస్తుంది.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలోనే పుష్ప సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది.ఈ నేపధ్యంలో తన నెక్స్ట్ సినిమాకి కూడా రష్మికని రిపీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

#Sukumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు