స్పీడ్ పెంచిన రష్మిక… వరుసగా పెద్ద సినిమాలకి గ్రీన్ సిగ్నల్  

Rashmika Mandanna Speed up In Tollywood Star Race, Tollywood, Telugu Cinema, Pushpa Movie, Sulthan Movie, Akhil, Surendar Reddy, Acharya Movie - Telugu Acharya Movie, Akhil, Pushpa Movie, Rashmika Mandanna, Sulthan Movie, Surendar Reddy, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తున్న కన్నడ భామ రష్మిక మందన వరుస సినిమాలతో తన జోరు చూపిస్తుంది.ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో రష్మిక ఉంది.

TeluguStop.com - Rashmika Mandana Speed Up In Tollywood Star Race

దీంతో పాటు తమిళంలో కార్తీ సుల్తాన్ సినిమా కూడా సెట్స్ పైనే ఉంది.ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి.

మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టింది.ఈ నేపధ్యంలో వచ్చే ఏడాది రష్మిక ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఉంటుంది.

TeluguStop.com - స్పీడ్ పెంచిన రష్మిక… వరుసగా పెద్ద సినిమాలకి గ్రీన్ సిగ్నల్-General-Telugu-Telugu Tollywood Photo Image

పుష్ప, సుల్తాన్ సినిమా ఉండగానే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటించడానికి ఒకే చెప్పింది.ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.

అయితే వచ్చే ఏడాది రామ్ చరణ్ కి సంబందించిన సన్నివేశాలు షూటింగ్ జరిగే అవకాశం ఉంది.

వీటితో పాటు శర్వానంద్ కి జోడీగా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తుంది.ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి.ఇప్పుడు అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లబోయే సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.

త్వరలో దీనిని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం అఖిల్ పూజాహెగ్డేతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.వీటితో పాటు ఎన్ఠీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం కూడా రష్మిక పేరుని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఏది ఏమైనా రష్మిక జోరు చూస్తూ ఉంటే రెండేళ్లలో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేయడం పక్కా అనిపిస్తుంది.

#Akhil #Surendar Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rashmika Mandana Speed Up In Tollywood Star Race Related Telugu News,Photos/Pics,Images..